యూత్, పెద్దలు మెచ్చేలా "స్టాండప్ రాహుల్": సీనియర్ నటి ఇంద్రజ
హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈనెల 18న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా సీనియర్ నటి ఇంద్రజ పలు విషయాలు తెలియజేశారు.
దర్శకుడు శాంటో నాకు ఫోన్ లోనే కథ చెప్పారు. చాలా ఆసక్తిగానూ సరికొత్తగానూ అనిపించింది. సహజంగా తల్లీ, కొడుకుల మధ్య రిలేషన్, మాటలనేవి తండ్రిని సపోర్ట్‌గా మాట్లాడడం వుంటాయి. కానీ ఈ కథలో దర్శకుడు తల్లి ప్రాధాన్యత కుటుంబంలో ఎంత వుంటుందో చక్కగా చెప్పాడు.
మురళీ శర్మ నా భర్తగా నటించారు. కానీ ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను. భర్త దగ్గర లేని క్వాలిటీని కొడుకు దగ్గర చూడాలని చిన్నప్పటి నుంచీ జాగ్రత్తగా పెంచుతుంది. అయినా తను తండ్రిలాగానే వున్నాడని తెలిసి బాధ పడుతుంది. చివరికి కుమారుడు తల్లిని ఏవిధంగా అర్థం చేసుకున్నాడనే ముగింపు చాలా బాగుంటుంది.
సపోర్టింగ్ పాత్రలనేవి మగవారికి బాగానే వస్తున్నాయి. మహిళలకు సరైన పాత్రలు రావడంలేదు. అందుకే నాకు సినిమాలలో చాలా గ్యాప్ వచ్చింది. సరైన పాత్రలు రాకపోవడం ఒక కారణం. రొటీన్ పాత్రలే రావడంతో కొన్ని వదులుకున్నా.