Vindhya Gold Silver Bar Challenge : వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో హీరోయిన్ ధన్య బాలకృష్ణ సందడి
హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall కొండాపూర్)లో వింధ్య గోల్డ్ (Viindya Gold) – సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్‌కు హీరోయిన్ ధన్యబాలకృష్ణ హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ... "వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ ఒక బంగారు భరోసా లాంటిది. నాణ్యమైన ఆభరణాలతో పాటు ఈ ఛాలెంజ్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది," అని అన్నారు. ఆమె సందర్శకులతో కలిసి ఛాలెంజ్‌లో పాల్గొని, వారిని ఉత్సాహపరిచారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.