Yamadheera : క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్, ఈవీఎం ల ట్యాంపరింగ్ పై 'యమధీర'
కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ గారి చేతుల మీద జరగగా నేడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్ లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, నిర్మాత డి. ఎస్. రావు గారు, పి. శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.
తారాగణం : కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.
టెక్నికల్ టీం :
ప్రొడక్షన్ : శ్రీ మందిరం ప్రొడక్షన్స్
కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్
మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర
ఎడిటింగ్ : సి రవిచంద్రన్
సంగీతం : వరుణ్ ఉన్ని
నిర్మాత : వేదాల శ్రీనివాస్ రావు గారు
కథ & దర్శకత్వం : శంకర్ ఆర్
పి ఆర్ ఓ : మధు VR