For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhimaa Trailer : 'భీమా' అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఎక్స్ ట్రార్డినరీ సినిమా : హీరో గోపీచంద్

11:25 PM Feb 24, 2024 IST | Sowmya
Updated At - 11:25 PM Feb 24, 2024 IST
bhimaa trailer    భీమా  అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఎక్స్ ట్రార్డినరీ సినిమా   హీరో గోపీచంద్
Advertisement

మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా ఈ సీజన్‌లో చాలా మంది ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు అన్ని వైపులా నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో డోస్ పెంచారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్ గా  చేశారు.

సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్‌ అద్భుతంగా ఓపెన్ అవుతుంది.శ్రీమహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు. ట్రైలర్‌లో గోపీచంద్‌లోని మరో పాత్రను కూడా చాలా అద్భుతంగా పరిచయం చేశారు.

Advertisement GKSC

కన్నడలో స్టార్ దర్శకుడైన హర్ష  లార్జర్ దెన్ లైఫ్ కథతో ముందుకు వచ్చాడు, ఆధ్యాత్మిక, ఇతర లేయర్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో  మెస్మరైజ్ చేశారు. అతను కనికరం లేని పోలీసుగా కనిపిస్తుండగా, మరో  అవతార్ చాలా టెర్రిఫిక్ గా ఉంది. గోపీచంద్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునంరు. ట్రైలర్‌లో కథానాయికలు ప్రియా భవానీ శంకర్ , మాళవిక శర్మతో సహా ఇతర పాత్రలను చూపించినప్పటికీ, ప్రధాన దృష్టి గోపీచంద్ యొక్క రెండు పాత్రలపై  ఉంది. సినిమా ప్రధాన అంశాలను చాలా ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లెస్ చేసారు.

స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. డైలాగ్స్ ఎఫెక్టివ్ గా వున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, స్ట్రాంగ్ టెక్నికల్ అవుట్‌పుట్ తో ట్రైలర్ చాలా గ్రాండ్‌గా వుంది. ట్రైలర్ ఖచ్చితంగా సినిమా అంచనాలని మరింతగా పెంచింది. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు  'భీమా' చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement
Author Image