For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

యాడ్ అయితే ముప్పై సెకన్లు ఉంటుంది.. సినిమా అయితే రెండున్నర గంటలు ఉంటుంది. అంతే తేడా: దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక

07:44 AM Feb 04, 2022 IST | Sowmya
Updated At - 07:44 AM Feb 04, 2022 IST
యాడ్ అయితే ముప్పై సెకన్లు ఉంటుంది   సినిమా అయితే రెండున్నర గంటలు ఉంటుంది  అంతే తేడా  దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక
Advertisement

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హ‌ర్ష్ క‌నుమిల్లి ఈ చిత్రానికి క‌థా ర‌చ‌యితగా వ్య‌వ‌హ‌రించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 11న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ క్రమంలో దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక మీడియాతో ముచ్చటించారు.

సెహరి అంటే సెలెబ్రేషన్. అన్ని భాషల్లో ఈ పదానికి అర్థం ఉంది. మేం సంస్కృతం నుంచి తీసుకున్నాం. ఓయ్ సినిమాలో పాట వల్ల ఇంకా ఫేమస్ అయింది. నేను గత ఆరేళ్ల నుంచి యాడ్ ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నాను. ఇదే నా మొదటి చిత్రం. అనుకున్న టైంలోనే సినిమాను తీశాం. కానీ ప్యాచ్ వర్క్‌ కాస్త లేట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యంగా జరిగింది. అందుకే సినిమా రిలీజ్‌ లేట్ అయింది.

Advertisement GKSC

హీరో హర్ష అందించిన కథతోనే సినిమాను తీశాను. రామ్ కామ్ అని చెప్పడంతో పెద్ద అంచనాలు పెట్టుకుని కథ వినలేదు. కానీ కథ చాలా నచ్చింది. ఆ తరువాత చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈ సినిమాను తీశాను. కథ విన్న వెంటనే చేసేస్తాను అని చెప్పాను. ప్రీ ప్రొడక్షన్ కోసమే మూడు నెలలు పని చేశాం.

నాది చిత్తూరులోని పలమనేరు ప్రాంతం. ఎంఎస్సీ చదివాను. ఎవరి దగ్గరా పని చేయలేదు. యాడ్ ప్రొడక్షన్ కంపెనీలో పని చేశాను. దాదాపు 70కి పైగా యాడ్స్ తీశాను. ఇదే నా మొదటి చిత్రం. అందులో ఉన్న అనుభవం వల్లే ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి.

యాడ్ అయితే ముప్పై సెకన్లు ఉంటుంది.. సినిమా అయితే రెండున్నర గంటలు ఉంటుంది. అంతే తేడా. ఇక సినిమాల వరకు అయితే షెడ్యూల్స్‌కు గ్యాప్ వస్తుంది. ఆ మూడ్‌ని అలానే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ యాడ్ షూటింగ్‌లో ఒకటి రెండు రోజుల్లో మొత్తం అయిపోయింది. యాడ్ ఫిల్మ్ మేకింగ్ అనుభవం వల్ల చకచకా సినిమాను తీసేయగలిగాను. లొకేషన్స్ షిప్ట్ చేసుకోగలిగాను. అందరిలో కో ఆర్డినేట్ అవ్వగలిగాను.Within two minutes of the start of the film, `Sehari` enters the world - director Gnanasekhar Dwarka,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,1యుక్త వయసులో అబ్బాయి మనస్తత్వం, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాల మీద తెరకెక్కించాం. రెండున్నర గంటలు సినిమా అద్భుతంగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే సెహరి ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చే సరికి అందరి మొహాల మీద చిరునవ్వు ఉంటుంది. సెహరి టైటిల్ మీద చాలా చర్చించుకున్నాం. తెలిసిన వాళ్లందరికీ చెప్పాం. నిర్మాతతో కూడా చాలా చర్చించాం. సెహరి ఫస్ట్ లుక్ వచ్చిన తరువాత అందరూ దాని గురించి మాట్లాడారు. ఇంత మంచి టైటిల్ ఎలా దొరికిందని అడిగారు. అందరికీ అంత నచ్చిందన్నమాట. పదం తెలుసు. కానీ సెహరి అర్థం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అందుకే ట్రైలర్‌లో చెప్పాను.

Advertisement
Author Image