Wild Dog Movie Released on April 2nd,King Nagarjuna,Dia Mirza,
ఏప్రిల్ 2న రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన వైల్డ్ డాగ్
కింగ్ నాగార్జున దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ,అవిజిత్ దత్ ముఖ్య పాత్రధారులుగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అహిషోర్ సొలోమన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం వైల్డ్ డాగ్. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, నటులు ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, కెమెరామెన్ షానియల్ డియో, చిత్ర దర్శకుడు అహిషోర్ సొలోమన్, నిర్మాత నిరంజన్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్స్ ఎన్ యం ఫాష, జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.