For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూన్ 20th నుండి జూన్ 26th వరకు వారఫలాలు.

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
horoscope  ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూన్ 20th నుండి జూన్ 26th వరకు వారఫలాలు
Advertisement

Weekly Horoscope From June 20th to 26th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.

Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూన్ 20th నుండి జూన్ 26th వరకు వారఫలాలు.

మేష రాశి :
ఆర్థిక పరమైన విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో సాధారణ ఫలితాలు. వీరు కుజ, బుధ భగవాన్ లకి సంబంధించి శ్లోకాలు చదవాలి.

వృషభ రాశి:
వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కలదు. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు. ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలు. వీరు ఆరోగ్య కోసం ఆదిత్యహృదయం చదవటం శ్రేయస్కరం.

Advertisement GKSC

మిథున రాశి :
వృత్తి జీవితంలో అభివృద్ధి. స్థిరాస్తుల వల్ల ఆదాయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు. వీరికి నారాయణ కవచ శ్రవణం శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :
వీరు ఈవారం మిశ్రమ ఫలితాలు పొందుతారు. క్రియేటివ్ ఫీల్డ్ లో వున్న వారికి స్వల్ప లాభాలు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తిలో గుర్తింపు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గౌరీ అష్టకం చదవటం శ్రేయస్కరం.

సింహ రాశి :

తండ్రి వైపు నుండి ధన లాభం. కుటుంబంతో కలసి ప్రయాణాల సూచన. వివాహ ప్రయత్నాల విషయంలో కొంత నిరాశ ఎదుర్కొంటారు. దూర ప్రాంతాలలో వున్న సంస్థలలో ఉద్యోగం పొందే అవకాశం కలదు. వీరికి సూర్యఅష్టక పఠనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్య రాశి :
వారం మొదట్లో ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదురుకున్నప్పటికి వాటి నుంచి విజయవంతంగా బయట పడతారు. ఉద్యోగంలో కొంత ఒత్తిడి కలుగుతుంది. అధికారుల నుంచి వ్యతిరేకత  ఎదురయ్యే అవకాశం కలదు. ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.
వ్యాపారంలో స్వల్ప లాభాలు. వీరు విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :
వీరికి ఆరోగ్య పరంగా, వృత్తి పరంగా, ఆదాయపరంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొంటుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. విద్యార్ధులకి సానుకూల ఫలితాలు. వీరు శ్రీలక్ష్మి అష్టోత్తరం చదవటం శ్రేయస్కరం.

వృశ్చిక రాశి :
వీరికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వాహన లాభం. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం. వీరు కాలబైరవ అష్టకం చదవటం శ్రేయస్కరం.

ధనస్సు రాశి :
ఆరోగ్య పరంగా ఉత్తమ ఫలితాలు. స్వల్ప ఆదాయం. ప్రయాణ సూచన. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి. ఆధ్యాత్మిక పరమైన విషయాలలో ఆసక్తి. వీరు శ్రీ చంద్రశేఖర అష్టకం చదవటం శ్రేయస్కరం.

మకర రాశి :
వీరికి మిశ్రమ ఫలితాలు. స్వల్ప ఖర్చులు. నూతన గృహోపకరణాల కొనుగోలు. వారం మధ్యలో కొంత మానసిక ఒత్తిడి. నూతన అంశాలు నేర్చుకోవటం పై ఆసక్తి కనపరుస్తారు. వృత్తిలో గౌరవం. వీరు శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పఠనం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి :
ఆర్థిక లాభం.ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త వహించాలి. సోదరులలో విషయంలో శుభవార్త శ్రవణం. నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానం ఉద్యోగంలో స్థిరత్వం పొందుతారు. వీరికి శివారాధన కలసి వస్తుంది .

మీన రాశి :
వివాహ ప్రయత్నాలలో విజయం. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు. నూతన కార్యక్రమాలు వాయిదా వెయ్యటం ఉత్తమం. ఉద్యోగ మార్పు Weekly Horoscope From June 20th to 26th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.కి సంబంధించి ప్రయత్నాలు కొంత కాలం వాయిదా వెయ్యటం ఉత్తమం. వీరు గురు స్వరూపాన్ని ఆరాధించటం ఉత్తమం.

Advertisement
Author Image