Shirdi Sai Laxmi Mahayagnam 2025 : కనుల పండుగగా శిరిడి సాయి లక్ష్మి మహా యజ్ఞం
BHKATHI : హైదరాబాద్, ఎప్రిల్ 2025 షిరిడి సాయి -లక్ష్మి మహా యజ్ఞం ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహా యజ్ఞం గత 26 సంవత్సరాలు షిరిడిలో నిర్వహించానని.. ఈ ఏడాది మొట్టమొదటిసారి హైదరాబాదులో నిర్వహించినట్టు శ్రీ సాయి భక్త లక్ష్మీ భాయ్ షిండే ట్రస్ట్ -షిరిడి మేనేజింగ్ ట్రస్ట్రీ (లక్ష్మీబాయి షిండే ముని మనవడు అరుణ్ షిండే గైక్వాడ్ పాటిల్ తెలిపారు. 999 హోమగుండాలని ఏర్పాటు చేసి నిర్వహించిన ఈ మహా యజ్ఞంకు సాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
షిరిడి సాయిబాబా లక్ష్మీబాయికి స్వయంగా ఇచ్చిన 9 నాణ్యాలను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి గీతారెడ్డి కూడా హాజరై, ఆసిస్సులు పొందారు. శైలజ మా షిండే గైక్వాడ్ పాటిల్ గీతారెడ్డి తో పాటు నగరంలోని వివిధ సాయి మందిరాల నుండి వచ్చిన పెద్దలను ఘనంగా సత్కరించారు.