Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూలై 11th నుండి జూలై 17th వరకు వారఫలాలు.
మేష రాశి:
వీరికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అవకాశం స్వల్పఆదాయం. విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వివాహ విషయంలో కొంత ఆలస్యం కనిపిస్తోంది.
ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కాలభైరవ అష్టకం చదవటం శ్రేయస్కరం.
వృషభ రాశి :
సంతానం విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. తండ్రి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యటం ఉత్తమం. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పాటించటం శ్రేయస్కరం.
మిథున రాశి :
గృహ, వాహన లాభం. విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు. వ్యాపార రంగంలో వున్నవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుంది. వృత్తిలో స్వల్ప మార్పులు సూచించ పడుతున్నాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యటం శ్రేయస్కరం.
కర్కాటక రాశి :
ఈ రాశి వారికి ఈ వారం ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం కలసి వస్తుంది. విద్యార్థులకి ఉన్నత విద్య రీత్యా ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సున్నితమైన మాట తీరుతో వ్యవహరించటం శ్రేయస్కరం. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ ఉమామహేశ్వర స్తోత్రము పఠనం చెయ్యటం ఉత్తమం.
సింహ రాశి :
ఆరోగ్య విషయంలో వైద్యుల సూచనలు తీసుకోవటం ఉత్తమం. ఖర్చులు అధికం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు అధిక శ్రమ తీసుకోవలసి ఉంటుంది.వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ సూర్య అష్టకం చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి :
వ్యాపార రీత్యా కొంత వొత్తిడి ఎదురుకొంటారు. సోదరులతో కొన్ని వివాదాలు చోటు చేసుకునే అవకాశం కలదు. విద్యార్థులు అధిక శ్రమతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ గణేష్ మంగళ్ అష్టకం చదవటం శ్రేయస్కరం.
తులా రాశి :
వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార రీత్యా స్వల్ప ఆదాయం అందుకుంటారు. సోదరులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. సంతానం విద్య పరంగా ఉన్నత ఫలితాలు అందుకుంటారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ లక్ష్మి ద్వాదశ నామ స్తోత్రం చదవటం శ్రేయస్కరం .
వృశ్చిక రాశి :
ప్రయాణాలు కలసి వస్తాయి. గృహ, స్థిర ఆస్తులకి సంబంధించి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నూతన పెట్టుబడుల విషయం లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ మార్పు సూచిస్తోంది. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సుబ్రమణ్య అష్టకం చదవటం శ్రేయస్కరం .
ధనస్సు రాశి :
కుటుంబ విషయాల వల్ల కొంత వొత్తిడికి లోను అవుతారు. స్వల్ప ఆదాయం అందుకుంటారు. వృత్తిలో స్థాన చలనం సూచిస్తోంది. విద్యార్ధులకి కొంత నీరాశాజనకమయిన ఫలితాలు ఎదురు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దక్షిణ మూర్తి శ్లోకం చదవటం శ్రేయస్కరం.
మకర రాశి :
ఈ రాశి వారికి ఈ వారం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అధిక ఆదాయం సూచించ పడుతున్నాయి. నూతన కార్యక్రమాలను వాయిదా వెయ్యటం వల్ల కొంత వొత్తిడి ఎదురు కావలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి.
ఈ రాశి వారు గోవిందా నామాలు చదవటం శ్రేయస్కరం.
కుంభ రాశి :
ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త పాటించటం శ్రేయస్కరం. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. స్తిరస్తుల కొనుగోలు వాయిదా వెయ్యటం ఉత్తమం. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
మీన రాశి :
ఆరోగ్య పరంగా ఉత్తమ ఫలితాలు. స్వల్ప ఆదాయం. నూతన కార్యక్రమాలు వాయిదా వెయ్యటం సూచిస్తోంది. విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తి లో సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం చదవటం శ్రేయస్కరం.