For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మార్చి 14th నుండి మార్చి 20th వరకు వారఫలాలు.

02:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:13 PM May 11, 2024 IST
ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మార్చి 14th నుండి మార్చి 20th వరకు వారఫలాలు
Advertisement

Weekly Horoscope From 14th March to 20th March by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant,

Ph +91 90001 11019

మేష రాశి :
ఈ రాశి వారికి ఈవారం ఆరోగ్యపరంగా సానుకూల మైన ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. వీరి యొక్క సంతానికి ఆర్థికపరమైన అభివృద్ధి కలుగుతుంది. నూతన ఉద్యోగం ప్రయత్నిస్తూ న్న వారు, ఇంటర్వ్యులో విజయం సాధిస్తారు. వైవాహికజీవితంలో స్వల్ప సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. రైతులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కాలభైరవ అష్టకం చదవటం శ్రేయస్కరం.

వృషభ రాశి :
వైద్యుల సహకారం ఆరోగ్యసమస్యలు నుంచి బయట పడతారు. వీరి యొక్క సోదరులకు వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు అధిక శ్రమ చెయ్యాల్సి వస్తుంది. వ్యాపారస్తులకి ఉత్తమ లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకి వృతి రీత్యా ప్రయాణాలు సూచిస్తున్నాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం మహాలక్ష్మి అష్టకం చదవటం మంచిది.

Advertisement GKSC

మిథున రాశి :
ఈ రాశి వారికి ఈవారంలో ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణ ఫలితాలు కలుగుతాయి. వీరి యొక్క సంతానం కాంపిటీషన్ లో విజయం సాధిస్తారు. ఇది వరుకు తీసుకున్న ఋణాలను కొంత మొత్తంలో తీరుస్తారు. ఉద్యోగస్తులకి వృత్తిలో మార్పు వుండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు. దూర ప్రయాణాలు కలసి వస్తాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ వేంకట్శ్వర స్వామిని ఆరాధించుట ఉత్తమం.

కర్కాటక రాశి :
ఆరోగ్యపరంగా మిశ్రఫలితాలు కలుగుతాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. వారసత్వ ఆస్తులు విషయం లో లాభిస్తుంది. కుటుంబ వ్యాపారం లో వున్నవారికి లాభాలు కలుగుతాయి. విద్యార్థులు శుభ వార్తలు వింటారు. వృత్తిలో ఉన్న వారికి మంచి ఫలితాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివాలయం సందర్శించడం శ్రేయస్కం.

సింహ రాశి :
ఈ రాశి వారికి ఈవారం ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు కలుగుతాయి. వృత్తి పరంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు రావచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యకి సంబందించిన పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. వీరి యొక్క సంతానం అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార పరంగా కొంత రుణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకి ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించు కోవటం శ్రేయస్కరం.

కన్య రాశి :

ఆరోగ్యపరంగా మిశ్రమ మైన ఫలితాలు పొందుతారు. స్వల్ప ఆదాయం అందుకుంటారు. విద్యార్థులు అధిక శ్రమ చెయ్యాల్సి వస్తుంది. అదేవిధంగా పూర్వం చేసిన ఋణాలు స్వల్ప మొత్తంలో తీరుస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకునే వారు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనటారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీరామ రక్షా స్తోత్రము పఠనం చెయ్యటం ఉత్తమం.

తుల రాశి :
ఆరోగ్యం బాగుంటుంది.వాహన, భూ సంబంధిత ఆదాయ మార్గాల ద్వార రాబడి కనిపిస్తోంది. కుటుంబంలో ప్రయాణానికి సంబందించిన చర్చలు జరుగుతాయి. విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తీసుకున్న రుణాలు స్వల్ప మొత్తంలో తీరుస్తారు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం మహా లక్ష్మి అష్టకం చదవటం శ్రేయస్కరం.

వృశ్చకరాశి :
ఈ రాశి వారికి ఈవారంలో ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. కొన్ని శుభకార్యములు చేపడతారు. ఆటోమొబైల్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తారు. అధికారుల నుండి కొంత ఓత్తిడి ఎదురుకొంటారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గణపతిని పూజించడం మంచిది.

ధనస్సు రాశి :

శ్వాస మరియు ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. విద్యార్థులు అధిక శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. రుణాలు తీర్చే క్రమంలో కొంత వొత్తిడి ఎదురుకుంటారు. వీరు యొక్క సంతానం విద్య విషయంలో బాగా రాణిస్తారు. కుటుంబంలో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి బాగా కలసి వస్తుంది. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం హనుమాన్ చాలీసాను చదవటం మంచిది.

మకర రాశి :
ఈ రాశి వారికి ఈవారంలో ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార పరంగా కలసి వస్తుంది. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానం యొక్క వివాహం సంబందించిన సానుకూలమైన ఫలితాలు పొందుతారు. వృత్తి పరంగా గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివాలయం సందర్శించడం మంచిది.

కుంభ రాశి :
ఈ రాశి వారికి ఈవారం కొంత ఆనారోగ్య సూచనలు కనిపస్తున్నాయి, స్వల్ప ఆదాయం అందుకుంటారు. వీరి సోదరులు వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వీరి యొక్క సంతానానికి ఇంటర్వ్యూస్లో విజయం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. దూర ప్రయాణాలు చెయ్యాల్సి వస్తుంది. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించటం ఉత్తమం.

మీన రాశి :
ఈవారం ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం వారం చివరలో పెరుగుతుంది. సోదరుల సహకారంతో ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతారు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం ఉత్తమం.

Advertisement
Author Image