For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ద్వాదశ రాశులు వారికి గోచార రీత్యా మార్చ్ 07th నుండి మార్చ్ 13th వరకు వారఫలాలు.

02:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:13 PM May 11, 2024 IST
ద్వాదశ రాశులు వారికి గోచార రీత్యా మార్చ్ 07th నుండి మార్చ్ 13th వరకు వారఫలాలు
Advertisement

ద్వాదశ రాశులు వారికి గోచార రీత్యా మార్చ్ 07th నుండి మార్చ్ 13th వరకు వారఫలాలు.

మేష రాశి:
ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం స్వల్పంగా ఉంటుంది. సంతానానికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తిలో సానుకూల ఫలితాలు అందుకుంటారు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం .

Advertisement GKSC

వృషభ రాశి:
వృత్తిలో గుర్తింపు. ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థానచలనం. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం లక్ష్మీనరింహస్వామివారిని సేవించటం ఉత్తమం.

మిథున రాశి:

వైద్యుల సూచనలతో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందతారు. వ్యాపార వృద్ధి విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. సోదరులకి ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగంలో సమస్యల నుండి బయట పడతారు. సంతానానికి దూర ప్రయాణం సూచన. ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గౌరీ అష్టకం చదవటం శ్రేయస్కరం.

కర్కాటక రాశి:
ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారంలో వృద్ధి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. వృత్తిలో కొంత వొత్తిడి ఎదుర్కొంటారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పాటించటం శ్రేయస్కరం.

సింహ రాశి:
ఆరోగ్య పరంగా, వృత్తి పరంగా మంచి గుర్తింపు. ఆదాయం పరంగా మిశ్రమ ఫలితాలు. స్థిరాస్తులు కొనుగోలు విషయం లో కొంత జాప్యం, సంతా నానికి వృత్తిలో మార్పు సూచించ పడుతోంది. ఈ రాశి వాళ్ళు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సూర్య అష్టకం చదవటం శ్రేయస్కరం .

కన్య రాశి:
శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకం. వివాహాది శుభ వార్తల శ్రవణం. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు . వృత్తి లో స్థాన చలనం. గృహ లాభం. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గణపతి ఆరాధన శ్రేయస్కరం.

తుల రాశి:
స్థిరమైన ఆలోచనలు లేకపోవటం వల్ల పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు. వాదనల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్యామల దండకం చదవటం ఉత్తమం.

వృశ్చిక రాశి:
ఆర్థిక లాభం. అన్ని కార్యాలలో విజయం. ఉద్యోగం లో అనుకున్న ప్రాంతానికి స్థానచలనం. శుభ కార్యాల్లో పాల్గొనటం.
ఆరోగ్య విషయం లో జాగ్రత్త పాటించాలి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం చదవటం శ్రేయస్కరం.

ధనస్సు రాశి:
వ్యాపారంలో ఆర్థిక లాభం, నూతన పరిచయాలు. వృత్తి రీత్యా ప్రయాణాలు. విద్యార్ధులకి సానుకూల ఫలితాలు. సంతానానికి అనారోగ్య సూచన. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సద్గురు ప్రార్థన ఉత్తమం.

మకర రాశి:
శారీరక శ్రమ అధికం అవుతాయి. ఆర్థిక విషయాలలో కొంత అసంతృప్తికి లోను అవుతారు. వృత్తి, వ్యాపారాలలో ఎదుగుదల. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కనకధారా స్తోత్రము పఠనం చెయ్యటం ఉత్తమం .

కుంభ రాశి:
అనుకోని ప్రయాణాలు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఆదాయం ఖర్చులు సమంగా వుండటం.
విద్యార్థులకు అధిక శ్రమతో ఉత్తమ ఫలితాలు. ఇంటర్వూలలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివాలయ సందర్శన ఉత్తమం.

మీన రాశి:
వృత్తి, వ్యాపారాలలో లాభం. విద్యార్ధులకి ఉత్తమ కాలం. చెవి, చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం. చేపట్టిన కార్యాల్లో విజయం. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయ ప్రార్థన ఉత్తమం.

Advertisement
Author Image