For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'వాల్తేరువీరయ్య'ని ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు : మెగాస్టార్ చిరంజీవి

09:25 PM Jan 09, 2023 IST | Sowmya
Updated At - 09:25 PM Jan 09, 2023 IST
 వాల్తేరువీరయ్య ని ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు   మెగాస్టార్ చిరంజీవి
Advertisement

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా విడుదలైన వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వాల్తేరు వీరయ్య' జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో మెగామాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మాసీవ్ గా నిర్వహించింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల సమక్షంలో మాస్ జాతరలా జరిగిన మెగామాస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Title Song Out,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comమెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బాబీ వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో కథ చెప్పినపుడు వినగానే అద్భుతం అనిపించింది. షేక్ హ్యాండ్ ఇచ్చి ‘ఈ సినిమా తప్పకుండా చేస్తున్నాం’’ అని అప్పుడే  చెప్పాను. ఫస్ట్ హియరింగ్ లోనే చాలా బావుంది అనుకునే కథలు నా కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ నమ్మకంతో చెబుతున్నాను.. వాల్తేరు వీరయ్య చాలా బాగా ఆడుతుంది. ఈ సినిమా చేస్తున్నంత కాలం బాబీపై ప్రేమ రోజురోజుకు పెరుగుతూ పోయింది. దానికి కారణం తన కష్టపడే తత్త్వం. ఒక అనుభవంతో ఇచ్చిన సూచనని తీసుకొని సినిమా బెటర్ మెంట్ కోసం అహర్నిశలు ప్రయత్నం చేసే దర్శకుడు బాబీ. అందుకే మొదటి రోజు విన్నది తర్వాత రోజురోజుకి అద్భుతంగా రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరిని అలరించే సినిమా వాల్తేరు వీరయ్య.Megastar Chiranjeevi, Shruti Haasan, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Second Single 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' Unveiled,Telugu Golden TV,telugu world news,www.teluguworldnow.comబాబీలో కథకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ కనిపిస్తారు. ఆ తర్వాతే తనలో అభిమానిని చూస్తాను. అభిమాని అని సినిమా ఇవ్వలేదు. అతని ప్రతిభ అద్భుతమనే ఈ సినిమాని ఇచ్చాను. నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అనుకున్నదాని కంటే గొప్పగా సినిమాని తీశాడు. ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఎలిమెంట్స్ కావాలో అన్నీ చక్కగా పొందుపరిచాడు. వాల్తేరు వీరయ్య ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ఇది కదా సినిమా.. ఇలాంటి కమర్షియల్ సినిమా వచ్చి ఎంత కాలం అయ్యిందని ప్రతి ఒక్కరితో అనిపిస్తాడు బాబీ. బాబీ అందించిన ఈ సినిమా నిఖార్సయిన కమర్షియల్ సినిమా. మీ చేత షెబాష్ అనిపించుకునే సినిమా. అందుకే నమ్మకంగా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. బాబీ ఎక్కడా విశ్రాంతి చెందలేదు. ఎక్కడైనా చిన్న గ్రేఏరియా వుంటే తన రైటర్స్ తో కూర్చుని దాన్ని అద్భుతంగా మలచి ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా కసితో పని చేశాడు. అందుకే సినిమా అద్భుతంగా వచ్చింది. బాబీ చేసిన హార్డ్ వర్క్ చూసి నేను బాబీ అభిమానిని అయ్యాను. బాబీ నా అభిమాని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను.Party Song Of The Year- Boss Party From Megastar Chiranjeevi, Urvashi Rautela, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Unveiled,Ravi Teja, Shruti Haasan,www.teluguworldnow.comరామానాయడు, అశ్వనీదత్, అల్లుఅరవింద్, కేఎస్ రామారావు లాంటి గొప్ప నిర్మాతల స్థాయిలో నిలబడ్డదగ్గ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ రవిగారు, నవీన్ గారు, చెర్రీ. ఏనాడూ లెక్కలు చూసుకోలేదు. ఎక్కడా రాజీపడలేదు, సినిమాకి కావాల్సిన సమస్తం సమకూర్చారు. సినిమాలో మొదటి ఇరవై నిమిషాల్లో హాలీవుడ్ స్థాయి ఎపిసోడ్స్ వుంటాయి. అవి తెరపై చూస్తారు.  మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి నిర్మాతలని నిలబెట్టుకోవడం మన ఇండస్ట్రీ బాధ్యత. ఇన్నేళ పరిశ్రమలో ఒకే నిర్మాత రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదల చేయడం ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీనికి కారణం కథలపై వారికుండే నమ్మకం. ప్రేక్షకులు రెండు సినిమాలని ఆదరిస్తారనే నమ్మకం. మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పెద్ద విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రవితేజ ఆజ్ కా గుండా రాజ్ సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ తో నాకు పరిచయమయ్యాడు. తర్వాత అన్నయ్య సినిమా కలిసి చేశాం. అన్నయ్య నుండి అలా ఎదిగి ఈ రోజు మాస్ మహారాజ్ అయ్యాడు. తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య లో మా పాత్రలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. రవితేజ ఎంట్రీ తర్వాత సినిమా మరో స్థాయికి వెళుతుంది. ఈ పాత్రకు రవితేజ తప్పితే మరో నటుడు న్యాయం చేయలేడు. తను రావడం వలనే పాత్రకు న్యాయం జరిగింది.Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Fourth Song Poonakaalu Loading On December 30th,Telugu Golden TV,My Mix Et,www.teluguworldnow.comశ్రుతి హాసన్ చాలా చక్కగా చేసింది. తన పాత్రకు చాలా ప్రాధన్యత వుంటుంది. కేథరిన్ ఇందులో కీలకమైన పాత్ర. చాలా చక్కగా తన పాత్రని పోషించింది. ఊర్వశి రౌతేలా బాస్ పార్టీ సాంగ్ ని చాలా ఎనర్జిటిక్ గా చేసింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహా చాలా అద్భుతంగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారి పాత్రలో చాలా డెప్త్ వుంటుంది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శకలక శంకర్ అందరూ చక్కగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మా ఇంట్లో కుర్రాడు. ఈ రోజు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఆనందంగా వుంది. ఇందులో ప్రతి సాంగ్ కి ప్రాణం పెట్టి మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అద్భుతమైన  నేపధ్య సంగీతం చేశాడు. సినిమా ఒక మ్యూజికల్ జర్నీలా వుంటుంది. అర్ధర్ విలన్స్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వుంటాయి.Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja,Mythri Movie Makers Waltair Veerayya Fourth Song Poonakaalu Loading is out now,Telugu Golden TV,My Mix Et,telugu world news,www.teluguworldnow.comశేఖర్ మాస్టర్ నాతో మళ్ళీ వింటేజ్ స్టయిల్ లో చాలా చక్కగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్సులు చాలా గ్రేస్ ఫుల్ గా చేయించారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అద్భుతమైన సెట్ వర్క్ చేశారు. వాల్తేరు వీరయ్యలో ప్రతి పది నిమిషాలకు ఒక హై వుంటుంది. ప్రతి సీన్ అనూహ్యంగా వుంటుంది. థ్రిల్ ఇచ్చే విధంగా వుంటాయి. వావ్..అంటూ ప్రతిది  సీట్ ఎడ్జ్ లో చూస్తారు. దానికి కారణం రచయితలు కోనవెంకట్, మోహన్, చక్రి, వినీత్. బాబీ అందరినుండి మంచి వర్క్ ని రాబట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత బాబీ స్టార్ డైరెక్టర్ అవ్వడం అనేది ఎంతో దూరంలో లేదు. ఈ సినిమా కోసం అందరూ కలసి కట్టుగా పని చేశాం. వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అవ్వాలనే ఒకేఒక లక్ష్యంతో పని చేశాం. 13వ తేదిన పూనకాలు లోడింగ్. డోంట్ స్టాప్ సీయింగ్. గో ఆన్ సీయింగ్. లవ్ యూ ఆల్ ’’ అన్నారు.

Advertisement GKSC

ఇవి కూడా చదవండి  : -  విజయవాడ నేపథ్యంలో సాగే సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ , Entertainment : అలరిస్తున్న శాకుంతల ట్రైలర్.. 

Entertainment : సమంత జపమాల రహస్యం అదేనా..

Entertainment : అందుకే గ్లామర్ పాత్రలు చేయను.. వరలక్ష్మి శరత్ కుమార్

Entertainment : రూమర్ల పై స్పందించిన సాయి పల్లవి ఏమంటుందంటే..

Advertisement
Author Image