విశాల్ 'లాఠీ' పందెంకోడిలా ఆడుతుంది.. : హీరో మంచు మోహన్ బాబు
యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌తో కూడిన ‘లాఠీ’ టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. డిసెంబర్ 22న 'లాఠీ' అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతి ఎస్డీహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ లో గ్రాండ్ గా జరిగింది. అగ్ర హీరో మంచు మోహన్ బాబు ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. ''నేను గత ఏడేళ్ళుగా బయట సినిమా వేడుకలకు వెళ్ళడం లేదు. ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు విశాల్ 'లాఠీ' వేడుకకు వచ్చాను.'' తిరుపతిలో వేడుక వుంది. మీరు రావాలి'' అని విశాల్ ఫోన్ చేసి చాలా చనువుగా పిలిచాడు. నేనూ వస్తానని చెప్పాను. మా కుటుంబాల మధ్య ఆ అనుబంధం వుంది. విశాల్ నాన్న గారు నాతో 'యం. ధర్మరాజు ఎం.ఎ' లాంటి అద్భుతమైన సినిమా తీశారు. ఆయన నా నిర్మాత. ఈ సందర్భంగా విశాల్ తల్లితండ్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను.
విశాల్ 'పందెంకోడి' చూశాను. ఎక్స్ టార్డినరీ ఫెర్ఫార్మెన్స్. విశాల్ చేసిన సినిమాలన్నీ బావుంటాయి. అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 'లాఠీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తాను. అందులో కానిస్టేబుల్ నుండి వచ్చిన వారంటే మరింత గౌరవం. ఇలాంటి ఒక గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశాల్. భగవంతుని ఆశీస్సులతో 'లాఠీ' పందెంకోడిలా ఆడుతుంది. ఇది గ్యారెంటీ హిట్..హిట్..హిట్. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూడండి. విశాల్ ని ఆశీర్వదించండి'' అని కోరారు.