For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ– డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా మూవీ "లైగర్‌" టీజర్‌ విడుదల వాయిదా

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ– డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా మూవీ  లైగర్‌  టీజర్‌ విడుదల వాయిదా
Advertisement

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) Teaser To Release At A Better Time

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ– డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’ టీజర్‌ విడుదల వాయిదా

Advertisement GKSC

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబి నేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘లైగర్‌: సాలా క్రాస్‌బీడ్‌’ సినిమా టీజర్‌ కాస్త ఆలస్యంగా విడు దల  కానుంది. హీరో విజయ్‌ దేవరకొండ జన్మదినం సందర్భంగా ఈ ఆదివారం (మే 9) ‘లైగర్‌’ టీజర్‌ విడుదల అవుతుందని విజయ్‌ దేవరకొండ అభిమానులు, సినీ లవర్స్‌ ఆశించారు. ‘లైగర్‌’ చిత్రబృందానికి కూడా టీజర్‌ను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నప్పటికీని, ప్రస్తుత కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలోని విపత్కర పరిస్థి తులు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ‘లైగర్‌’ సినిమా టీజర్‌ విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు సద్దుమణిగి, ప్రజలు ఆనందంగా ఉన్న తరుణంలోనే ‘లైగర్‌’ టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నా రు. ఇందుకు సంబంధించి  ‘లైగర్‌’ చిత్ర బృందం ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.

‘‘ఈ ఆందోళనకర పరిస్థితుల్లో, ఈ కష్టసమయంలో మీరు, మీ కుంటుంబసభ్యులు క్షేమంగా ఉండాలని మేం కోరు కుంటున్నాం. ఇంట్లోనే ఉంటూ  మీ ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాం. తీసుకోవాలని వేడుకుంటున్నాం.

మే 9న ‘లైగర్‌’ సినిమా పవర్‌ ప్యాక్డ్‌  యాక్షన్‌ టీజర్‌ను విడుదల చేయాలని మేం అందరం అనుకున్నాం. కానీ కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్న ఈ తరుణంలో ‘లైగర్‌’ టీజర్‌ను విడుదల చేయాలని అనుకోవడం లేదు. అందుకే వాయిదా వేశాం. ఈ క్లిష్ట సమయాలు వెళ్లిపోయాక ‘లైగర్‌’ టీజర్‌ను మీ ముందుకు తీసుకువస్తాం.

టీజర్‌ విడుదలైన తర్వాత ‘లైగర్‌’ చిత్రంలోని విజయ్‌ దేవరకొండ లుక్‌కి, ఫెర్మార్మెన్స్‌కి ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు. టీజర్‌ విడుదల కానుందుకు ఇప్పుడు నిరుత్సాహపడ్డవారు ఆ క్షణం డబుల్‌ హ్యాపీతో ఉంటారు.

అప్పటివరకు దయచేసి అందరు ఇంట్లోనే ఉండండి. మీ, మీ ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. బాధ్యతగా ఉండండి. ఒకరికొకరం సాయం చేసుకుంద్దాం. వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ వేయించుకుంద్దాం. కోవిడ్‌ జాగ్రత్తలను, వైద్యుల సలహాలను పాటిద్దాం. కరోనాపై అందరం సమష్టిగా పోరాడదాం. త్వరలో థియేటర్స్‌లో కలు ద్దాం.

ఇట్లు
విజయ్‌ దేవరకొండ
ధర్మ ప్రొడక్షన్స్‌
పూరి కనెక్ట్స్‌

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మాణ విలువలు, బడ్జెట్‌ అంశాల్లో రాజీ పడకుండా  ‘లైగర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మోహతా ఈ ప్యాన్‌ ఇండియన్‌ సినిమాను సమిష్టిగా నిర్మిస్తున్నారు. విష్ణు శర్మ ఈ చిత్రానికి ఛాయగ్రాహకులు.

‘లైగర్‌’ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మార్షల్‌ ఆర్ట్స్ లో ప్రత్యేకశిక్షణ తీసుకున్నారు. చిత్రంలో విజయ్‌ దేవర కొండ పూర్తిగా స‌రికొత్త అవ‌తారంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరో యిన్‌గా నటి స్తున్నారు. విలక్షణ నటి రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రధారి. ‘లైగర్‌’ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

నటీనటులు :
విజయ్‌దేవరకొండ, అనన్యాపాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్‌ దేశ్‌ పాండే, గెటప్‌ శీను
సాంకేతిక నిపుణులు :
డీఓపీ: విష్ణు శర్మ
ఆర్ట్‌ డైరెక్టర్‌: జానీ షేక్‌ భాష
ఎడిటర్‌: జూనైద్‌ సిద్ధిఖీ
స్టంట్‌ డైరెక్టర్‌: అండీ లాంగ్‌

Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film.

Ramya Krishnan plays a prominent role in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.

Cast:

Vijay Deverakonda, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Aali, Makarand Desh Pandey and Getup Srinu.

Technical Crew:
DOP: Vishnu Sarma
Art Director: Jonny Shaik Basha
Editor: Junaid Siddiqui
Stunt Director: Andy Long

Advertisement
Author Image