For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: ప్యాన్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ "లైగర్"

11:06 PM Jan 01, 2022 IST | Sowmya
Updated At - 11:06 PM Jan 01, 2022 IST
film news  ప్యాన్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ  పూరీ జగన్నాథ్  లైగర్
Advertisement

ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న కొత్త సినిమా "లైగర్" (సాలా క్రాస్ బ్రీడ్). ప్యాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ప్రేక్షకులు "లైగర్" కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ వల్లే లైగర్ నుంచి విడుదలయ్యే ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శుక్రవారం న్యూ ఇయర్ సందర్భంగా "లైగర్" నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్యాన్ ఇండియా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. లైగర్ గ్లింప్స్ 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ సాధించి ప్యాన్ ఇండియా రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరే చిత్రానికి యూట్యూబ్ లో 24 గంటల వ్యవధిలో 16 మిలియన్ వ్యూస్ రాలేదంటే లైగర్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. విడుదలైన 7 గంటల్లోనే పాత రికార్డులు బద్దలు కొట్టిన లైగర్ గ్లింప్స్..24 గంటల్లో ఎవర్ గ్రీన్ వ్యూయింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Advertisement GKSC

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో లైగర్ గా బీస్ట్ లుక్ లో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. తన సినిమాల్లో హీరోలను ట్రెండ్ సెట్టింగ్ క్యారెక్టర్ లతో చూపించే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రౌడీ స్టార్ ను అదే రేంజ్ లో మాసీగా మార్చేశాడు. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ యాష్ ట్యాగ్ ప్యాన్ ఇండియా లెవెల్లో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండను చూసి సినిమా లవర్స్ అంతా సర్ ప్రైజ్ అయ్యారు.

ముంబై వీధుల్లో ఛాయ్ వాలాగా జీవించే ఓ యువకుడు బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు పూరీ జగన్నాథ్. Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Liger Breaks Pan India Records, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం:

దర్శక‌త్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: కెచ్చా
పీఆర్వో - వంశీ శేఖర్

Advertisement
Author Image