సూర్య "ఇ టీ" తెలుగు ట్రైలర్ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ
10:05 PM Mar 02, 2022 IST | Sowmya
Updated At - 10:05 PM Mar 02, 2022 IST
Advertisement
బహుముఖ నటుడు సూర్య తాజా యాక్షన్ థ్రిల్లర్ 'ET'. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10, 2022న ఒకేసారి విడుదల కానుంది.
ఇతరుల ఆనందంలో ఆనందాన్ని చూడాలనుకునే సామాజిక పోరాట యోధుడిగా సూర్య నటించారు. అతని గాల్ ఫ్రెండ్ గా ప్రియాంక అరుల్ మోహన్ బబ్లీ గా ఉండే పాత్ర పోషించింది. సామరస్యంగా వున్న ఓ గ్రామాన్ని ఒక నేరస్థుడు అతని ముఠా గ్రామంలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడంతో గ్రామంలో సామరస్యం దెబ్బతింటుంది. సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి కథానాయకుడు ఎటువంటి చర్య తీసుకున్నాడనేది కథ ప్రధాన ఇతివృత్తంగా రూపొందింది.
Advertisement