For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషి' నుంచి 'ఆరాధ్య' పాట విడుదల

01:49 PM Jul 13, 2023 IST | Sowmya
Updated At - 01:49 PM Jul 13, 2023 IST
విజయ్ దేవరకొండ  సమంత నటించిన  ఖుషి  నుంచి  ఆరాధ్య  పాట విడుదల
Advertisement

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ ప్రేమికులందరినీ కట్టిపడేశారు మేకర్లు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ప్రేమికుల గీతంగా నిలిచిపోయేలా ఉంది.

ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను శివ నిర్వాణ తెలుగులో రాయగా.. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. హిందీలో జుబిన్ నాటియల్, పలక్ ముచ్చల్.. కన్నడలో హరిచరణ్ శేషాద్రి, చిన్మయి.. మలయాళంలో కేఎస్ హరిశంకర్, శ్వేతా మోహన్ ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ మరింతగా హైలెట్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది.

Advertisement GKSC

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా కానున్నారు. ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాట యూట్యూబ్‌లో వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ 'ఆరాధ్య'తో మరో సారి 'ఖుషి' సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

Advertisement
Author Image