For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Vikram Rathode : విజయ్ ఆంటోనీ ‘విక్రమ్ రాథోడ్’ డిసెంబర్ 1న విడుదల

06:00 PM Nov 27, 2023 IST | Sowmya
Updated At - 06:00 PM Nov 27, 2023 IST
vikram rathode   విజయ్ ఆంటోనీ ‘విక్రమ్ రాథోడ్’ డిసెంబర్ 1న విడుదల
Advertisement

కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు విజయ్ ఆంటోని. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. రీసెంట్‌గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో విక్రమ్ రాథోడ్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కగా.. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ఓం శివ గంగా ఎంటర్‌ప్రైజెస్ (K బాబు రావు) , పీఎస్ఆర్ ఫిల్మ్స్ (జీ పీఎస్ రెడ్డి) బ్యానర్లపై డిసెంబర్ 1న భారీ ఎత్తున విడుదలకానుంది. తమిళంలో భారీ హిట్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement GKSC

ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటించారు.

Advertisement
Author Image