For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Vijay Antony : నేను 90 శాతం నయం అయ్యాను అంటున్న హీరో విజయ్ ఆంటోని..

08:45 PM Feb 02, 2023 IST | Sowmya
Updated At - 08:45 PM Feb 02, 2023 IST
vijay antony   నేను 90 శాతం నయం అయ్యాను అంటున్న హీరో విజయ్ ఆంటోని
Advertisement

Vijay Antony : తెలుగు ప్రేక్షకులకు బిచ్చ‌గాడు సినిమాతో దగ్గరయ్యాడు విజ‌య్ ఆంటోని. చాలా మంది అభిమానులు కూడా అయ్యారు. ఆ త‌ర‌వాత త‌న సినిమాల‌న్నీ తెలుగులో డ‌బ్ చేయ‌డంలో.. టాలీవుడ్ లో కూడా హీరో మెటీరియర్ అని నిరూపిచుకున్నారు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన ‘బిచ్చగాడు 2’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల మలేషియాలో ఈ సినిమా చిత్రీకరణ జరపగా.. గత నెల జనవరి 16న విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో విజయ్ దవడ ఎముకలు, ముక్కు బాగా దెబ్బతింది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అందించడంతో విజయ్ తిరిగి మామూలు స్థితికి చేరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంపైనా ట్వీటర్ వేదిక అప్డేట్ అందిస్తున్నా.. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ ఆంటోనీనే స్వయంగా తన ఆరోగ్యంపై అప్డేట్ అందించారు. తమిళంలో ట్వీట్ చేస్తూ హెల్త్ కండీషన్ ను తెలియజేశారు.

Advertisement GKSC

ట్వీట్ చేస్తూ.. ‘నన్ను ప్రేమించే హృదయాలకు కృతజ్ఞతలు. నేను 90 శాతం నయమయ్యాను. నా విరిగిన దవడ, ముక్కు ఎముకలు కలిసిపోయాయి. మీ అభిమానం వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నాను. ఏప్రిల్‌లో విడుదల కానున్న పిచైకారన్ 2 పనులను ఈరోజు నుంచి ప్రారంభిస్తాను’ అంటూ అప్డేట్ అందించారు. దీంతో అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు. విజయ్ కోలుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ని.. రీట్వీట్ చేస్తూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అలానే పలువురు ప్రముఖులు కూడా విజయ్ కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Author Image