For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: వినోదం, గ్లామర్ అన్ని రకాల హంగులతో "ఎఫ్ 3"

06:24 PM Jan 29, 2022 IST | Sowmya
Updated At - 06:24 PM Jan 29, 2022 IST
tollywood updates  వినోదం  గ్లామర్ అన్ని రకాల హంగులతో  ఎఫ్ 3
Advertisement

సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఎఫ్ 3 సినిమాతో వేసవికి మూడు రెట్లు వినోదాన్ని అందించబోతోన్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల కానుంది.

సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్గా రాబోతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisement GKSC

తమన్నా, మెహరీన్లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్ను అద్దేందుకు మూడో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 Talkie Part Wrapped Up, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ ,రాజేంద్ర ప్రసాద్, సునీల్ తదితరులు

సాంకేతిక బృందం : డైరెక్టర్: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్,
ఎడిటింగ్: తమ్మిరాజు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్.

Advertisement
Author Image