For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment News: విక్ట‌రి వెంక‌టేష్ నార‌ప్ప చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ "చ‌లాకీ చిన్న‌మ్మీ" విడుద‌ల‌

03:04 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:04 PM May 11, 2024 IST
entertainment news  విక్ట‌రి వెంక‌టేష్ నార‌ప్ప చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్  చ‌లాకీ చిన్న‌మ్మీ  విడుద‌ల‌
Advertisement

Victory Venkatesh Narappa Movie First Lyrical Song Chalaki Chinnamma Released, Srikanth Addala, Priyamani, Mani Sharma, Film News, Telugu World Now,

Entertainment News: విక్ట‌రి వెంక‌టేష్ నార‌ప్ప చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ "చ‌లాకీ చిన్న‌మ్మీ" విడుద‌ల‌.

Advertisement GKSC

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ చలాకీ చిన్న‌మ్మీ..ఈ రోజు విడుద‌లైంది.

వెంకటేష్ ఫ్యామిలీ అంతా కలిసి తన కొడుకు పెళ్లి చూపులకు వెళ్లే నేప‌థ్యంలో వ‌చ్చే పాట ఇది. కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా నటించిన విష‌యం తెలిసిందే..ఈ ఫ్యామిలీ పాట‌కు చిన్న రొమాంటిక్ ట‌చ్‌ని కూడా క‌లిపి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన ట్యూన్ కంపోజ్ చేశారు.

ఆదిత్య అయ్యంగార్‌, నూత‌న మోహ‌న్ శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట‌కు అనంత శ్రీ‌రామ్ మంచి సాహిత్యాన్ని అందించారు.

ఇటీవ‌ల సురేష్ ప్రొడ‌క్ష‌న్ వారు ఎస్పీ మ్యూజిక్ లేబుల్‌ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే..అందులో మొద‌టి సినిమాగా `నార‌ప్ప` సాంగ్స్ విడుద‌ల‌వుతున్నాయి. ఎస్పీ మ్యూజిక్ లేబుల్ వారు మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌డానికి ఇది ప‌ర్‌ఫెక్ట్ సాంగ్ అని చెప్పొచ్చు.

ఇప్ప‌టికే షూటింగ్, పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ముగిశాయి. త్వ‌రలోనే విడుద‌ల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు మేక‌ర్స్‌.

ఈ మూవీలో డిఫ‌రెంట్‌ షేడ్స్ ఉన్న స‌రికొత్త పాత్రల‌లో విక్ట‌రి వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే త‌న అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు ఉన్న బ‌జ్‌ని బ‌ట్టి చూస్తే `నారప్ప` వెంకటేష్‌కు మరో భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది.

తారాగ‌ణం: విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల
నిర్మాతలు: డి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌
కథ: వెట్రిమారన్‌
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్ పండీ
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌Victory Venkatesh Narappa Movie First Lyrical Song Chalaki Chinnamma Released,Srikanth Addala,Priyamani,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com,Mani Sharma

Advertisement
Author Image