Bhakthi : విభూది ఎందుకు ధరిస్తారో తెలుసా..
Bhakthi హిందూ సంప్రదాయంలో ఏ గుడికి వెళ్ళినా నుదుటిపైన విభూదిని పెట్టుకుంటారు అయితే దీని వెనక అసలు కారణమేంటో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే మన పురాణాలు దీనిపై ఏమని చెబుతున్నాయంటే..
గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విభూదిని తీసి నుదుటున పెట్టుకుంటాము అలాగే మరికొందరు ఈ విభూదిని నోట్లో కూడా వేసుకోవడం చూస్తూ ఉంటాము.. అలాగే శివాలయాల్లో విభూది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.. అయితే అసలు విభూదిని ఎలా తయారు చేస్తారు దీనికి అంత ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది అంటే.. హిందూ ఆలయాలలో చేసే హోమాలలో ఎంతో పవిత్రమైన దర్భలు, హోమ వస్తువులు, నెయ్యి వేసి హోమం చేస్తాము. ఈ విధంగా హోమంలోకి వేసిన వస్తువులు బస్మం కాగా ఏర్పడిన బూడిదను విభూది అంటారు.
అలాగే ఈ విభూతి అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరం. అందుకే ముఖ్యంగా శివాలయంలో విభూదిని అందుబాటులో ఉంచుతారు అలాగే శివలింగాన్ని కూడా విభూదితోనే అలంకరిస్తారు శివాలయం కు వెళ్ళిన భక్తులు మాత్రం ఖచ్చితంగా నుదుటి పైన బొట్టు పెట్టుకొని వస్తారు.. అలాగే సృష్టిలో ఏ వస్తువైనా చివరికి బూడిద కావలసిందే అని చెబుతూ ఉంటాయి మన పురాణాలు.. మనిషి దేహం కూడా చనిపోయిన తర్వాత బూడిద గానే మారుతుంది హిందూ సంప్రదాయం ప్రకారం దేహాన్ని కాలుస్తారు అంతటి పవిత్రమైన విభూది అంటే శివునికి ఎంతో ప్రీతి పాత్రం అందుకే మన దేవాలయాల్లో విభూదికి అంత ప్రత్యేకత కల్పించారు..