For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

భారతీయ నదులపై చేసిన రీసెర్చ్ గాను అవార్డు అందుకున్న సుఖేష్ శర్మ, వేదిక్ సైన్టిస్ట్.

12:28 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:28 PM May 13, 2024 IST
భారతీయ నదులపై చేసిన రీసెర్చ్ గాను అవార్డు అందుకున్న సుఖేష్ శర్మ  వేదిక్ సైన్టిస్ట్
Advertisement

బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మగారు.. ప్రముఖ దేవస్థానం అయిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు అయినటువంటి సురేష్ శర్మ గారి పుత్రులు. యజుర్వేద పండితులు..ఉత్తరభారతదేశం లో తెలుగు వాళ్లలో. కాశీలో తంత్ర శాస్త్రంలో లో మరియు వేదిక్ సైన్స్ లో ఉతీర్ణత సాధించన ఏకైక వేదిక్ సైన్టిస్ట్.

యజ్ఞ యాగాది కృతువులు చేయటం వల్ల ప్రకృతి లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే విషయం పైన ఆయన చేసిన రీసెర్చ్ కాను USA లో మరియు THAILAND లో కొంత మంది ప్రొఫెసర్లకు నచ్చి. మీకు కావాల్సిన అన్ని వసతులు మేం కల్పిస్తాం. ఇక్కడి నుండే మీరు రీసెర్చ్ చేసి ఫైనల్ కాపీ మాకు ఇవ్వండి అని జాబ్ ఆఫర్ చేస్తే. సున్నితంగా తిరస్కరించి సనాతన భారతీయ హైంధవ ధర్మం లో తన మూలాలను కనుకొనుటకు పరిశోధనలు చేస్తూ ఇక్కడే ఉన్నారు.

Advertisement GKSC

ఇంకా మన ప్రియతమ ముఖ్య మంత్రి గారి క్షేమం కోరుతూ మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై అధి శ్రవణ మహా రుద్ర యాగాలు చేసిన వ్యక్తి. ఈరోజు ఈయనకు చిక్కడి పల్లి త్యాగరాయ గాన సభలో భారతీయ నదులపైన ఆయన చేసిన రీసెర్చ్ గాను. తెలంగాణా గవర్నమెంట్ పురావాస్తు శాఖ మరియు ఆల్ ఇండియా రివర్ అస్సోసియేషన్ వారి ఆధ్వర్యంలో. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా. భారతీయ ఏకైక వేదిక్ సైన్టిస్ట్ గా మహా నది పురస్కార అవార్డును అందుకోవటం జరిగింది.

స్వామి వారు భారతదేశంలో వేద పండితులు ఎందరో ఉన్నారు కానీ వేదిక్ సైన్టిస్టులు తక్కువ కనుక మీరు వేదిక్ సైన్స్ లో మరిన్ని విషయాలను కనిపెట్టి ప్రపంచ దేశాల్లో మన సనాతన ధర్మం యొక్క కీర్తి పతకాలను నిలబెట్టు అని ఆశీర్వాదం చేసారు.. ఈ కార్యక్రమంలో సినీ నాయకులు. తెలంగాణా ప్రభుత్వ పలురంగాల రాజకీయ నాయకులు. అధికారులు పాల్గొన్నారు..

Vedic Scientist Sukesh Sharma who received the award for his research on Indian rivers,Chinna Jeeyar Swamy,Mohan Trust PMK Gandhi,Bhakthi News,Telugu Golden TV,v9 news,telugu world news,www.teluguworldnow.com

Advertisement
Author Image