తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా 'వేదిక్ సైన్టిస్ట్' బిరుదును పొందిన సుఖేష్ శర్మ
బ్రహ్మశ్రీ ఈశ్వరగారి సుఖేష్ శర్మ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు అయినటువంటి సురేష్ శర్మ గారి పుత్రులు. వీరు యజుర్వేద పండితులు. ఉత్తరభారతదేశం లో తెలుగు వాళ్లలో, కాశీలో వేద విద్యలతో పాటు ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేశారు మరియు వేదిక్ సైన్స్ లో ఉతీర్ణత సాధించన ఏకైక వేదిక్ సైన్టిస్ట్. అంతేకాకుండా యజ్ఞ యాగాది కృతువులు చేయటం వల్ల ప్రకృతి లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే విషయం పైన ఆయన చేసిన రీసెర్చ్ కాను USA లో మరియు THAILAND లో కొంత మంది ప్రొఫెసర్లకు నచ్చి. మీకు కావాల్సిన అన్ని వసతులు మేం కల్పిస్తాం. ఇక్కడి నుండే మీరు రీసెర్చ్ చేసి ఫైనల్ కాపీ మాకు ఇవ్వండి అని జాబ్ ఆఫర్ చేస్తే సున్నితంగా తిరస్కరించి సనాతన భారతీయ హైంధవ ధర్మం లో తన మూలాలను కనుకొనుటకు పరిశోధనలు చేస్తూ ఇక్కడే ఉన్నారు.
ఇంకా మన ప్రియతమ మాజీ ముఖ్య మంత్రి గారి క్షేమం కోరుతూ మరియు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కొరకై అధి శ్రవణ మహా రుద్ర యాగాలు, శత చండీ యాగాలు, రాజశ్యామల యాగాలు మొదలగు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి. ఈ రోజు ఈయనకు చిక్కడి పల్లి త్యాగరాయ గాన సభలో భారతీయ నదులపైన ఆయన చేసిన రీసెర్చ్ గాను. తెలంగాణా గవర్నమెంట్ పురావాస్తు శాఖ మరియు ఆల్ ఇండియా రివర్ అస్సోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా 'భారతీయ ఏకైక వేదిక్ సైన్టిస్ట్' బిరుదును ఇవ్వడంతోపాటు మహా నది పురస్కార అవార్డును వారికి అందించడం జరిగింది .
అంతేకాకుండా ప్రస్తుతం వారు ఇప్పటి జనరేషన్ కి అర్థమయ్యే విధంగా వేదిక్ సైన్స్ అనే పుస్తకాన్ని రచిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి లోగోలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలానే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకుల చేతులు మీదుగా రెండవ లోగోను ఆవిష్కరించడం జరిగింది. సుఖేష్ శర్మ గారిని ఉద్దేశిస్తూ చిన్న జీయర్ స్వామి వారు భారతదేశంలో వేద పండితులు ఎందరో ఉన్నారు కానీ వేదిక్ సైన్టిస్టులు తక్కువ కనుక మీరు వేదిక్ సైన్స్ లో మరిన్ని విషయాలను కనిపెట్టి ప్రపంచ దేశాల్లో మన సనాతన ధర్మం యొక్క కీర్తి పతకాలను నిలబెట్టు అని ఆశీర్వాదం చేసారు. ఈ కార్యక్రమంలో సినీ నాయకులు. తెలంగాణా ప్రభుత్వ ముఖ్య అధికారులతో పాటు పలురంగాల రాజకీయ నాయకులు. అధికారులు పాల్గొన్నారు.