For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

11న 'వర్షం' రీ రిలీజ్....టిక్కెట్ల స్పీడ్ బుకింగ్

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
11న  వర్షం  రీ రిలీజ్    టిక్కెట్ల స్పీడ్ బుకింగ్
Advertisement

గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన "వర్షం" సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ నెల 11న రీ రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా, గోపీచంద్ ప్రతి నాయకుడిగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులంతా అత్యుత్తమ నటనను కనబరిచిన ఈ సినిమాలోని పాటలు కూడా వీనులవిందుగా ఆకట్టుకున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. ఆ రోజులలో ప్రభాస్ కెరీర్ మలుపులో ఈ సినిమా అగ్ర భాగాన నిలిచింది కూడా. "ఈశ్వర్" సినిమాతో తన కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11 నాటికి కరెక్ట్ గా 20 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా "వర్షం" సినిమాను తమ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ తరపున రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తెలియజేశారు. ఇప్పటికే ఆన్ లైన్లో టిక్కెట్ల బుకింగ్ మొదలయ్యిందని, స్పీడ్ గా టిక్కెట్లు బుక్ అవుతూ, విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

థియేటర్లను దేవాలయాలు మాదిరిగా చూసుకోండి: అందరి హీరోల అభిమానులకు నట్టి కుమార్ విజ్ఞప్తి

Advertisement GKSC

తమ అభిమాన హీరోల సినిమాలను ప్రదర్శించే థియేటర్లను ఆయా హీరోల అభిమానులంతా దేవాలయాలు మాదిరిగా భావించి, వాటిని కాపాడుకోవాలని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాలలో సినిమాల విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలంలో థియేటర్లు డామేజ్ అయిన సంఘటనలు జరిగాయని, దయచేసి అభిమానులు తమ కోలాహలాన్ని కొనసాగిస్తూనే, థియేటర్లను దేవాలయాలు మాదిరిగా కాపాడుకోవాలని నట్టి కుమార్ అందరు హీరోల అభిమానులకు పిలుపునిచ్చారు.

Advertisement
Author Image