For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వారిసు తమిళ్ లో బ్లాక్ బస్టర్, తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది : దర్శకుడు వంశీ పైడిపల్లి

09:33 PM Jan 13, 2023 IST | Sowmya
Updated At - 09:33 PM Jan 13, 2023 IST
వారిసు తమిళ్ లో బ్లాక్ బస్టర్  తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది   దర్శకుడు వంశీ పైడిపల్లి
Advertisement

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వారసుడు/వారిసు. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 11న తమిళ్ లో విడుదలైన వారిసు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన అక్కడ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. జనవరి 14న వారసుడు తెలుగులో గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. నా జీవితంలో కుటుంబానికి చాలా ప్రాధన్యత వుంటుంది. ఎన్ని కష్టాల్లో కూడా మనతో తోడు వుండేది మన కుటుంబమే. ప్రతి కుటుంబాల్లో లోపాలు వుంటాయి. కానీ ఉన్నది ఒకటే కుటుంబం’. ఈ ఆలోచనతోనే వారసుడు కథ పై వర్క్ చేశాం. విజయ్ గారి కథ చెబితే ఒకే ఒక సిట్టింగ్ లో ఓకే అయిపోయిన కథ ఇది. అయితే విజయ్ గారితో ఈ సినిమా చేస్తున్నామన్న తర్వాత టెన్షన్ మొదలైయింది. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్  స్టార్. ఆయనకి సరిపడే విధంగా ఈ సినిమా చేయడం కోసం మంచి టీం వర్క్ చేశాం. వారిసు సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమా చూసి అందరూ నిలబడి క్లాప్స్ కొడుతున్నారు. ఒక మంచి కథని చెబితే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో వారసుడు మరోసారి నిరూపించింది. సినిమాని ప్రేమించడానికి ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి ఉండాల్సిన ప్రత్యేకత ఈ సినిమాకి వుంది.

Advertisement GKSC

శరత్ కుమార్ , జయసుధ గారి నటన గురించి అద్భుతంగా రాస్తున్నారు. అమ్మ నిజం, నాన్న నమ్మకం అదే ఈ సినిమాలో చూస్తారు.  సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆడిటోరియం మొత్తం లేచి మావైపు చూస్తూ చప్పట్లు కొట్టారు. అరవింద్ గారు ఫోన్ చేసి ‘’వెయ్యి కోట్లు పెట్టిన రాని అనుభూతి ఇది’’ అని అభినందించారు. 14వ తేదిన అదే రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి వస్తుంది. ఎందుకంటె ఇది ఒక తెలుగు గుండె తీసిన సినిమా.

దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. నేను ఏది అడిగిన కాదనకుండా ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్, శ్యామ్ .. నటీనటులు అంతా అద్భుతంగా చేశారు. రష్మిక చాలా బ్యూటీఫుల్ గా చేసింది. వారసుడు ఒక పండగ లాంటి సినిమా.  సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వస్తున్నపుడు  అమ్మనాన్నలకు ఒక కాల్ చేయాలని అనిపిస్తుంది. సంక్రాంతి కి వారసుడు సంక్రాంతి సెలబ్రేట్ అవుతుందని నమ్మకం వుంది’’ అన్నారు.

Advertisement
Author Image