For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Vaishnavi Chaitanya : 'నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేని టైంలో బేబీ సినిమా తీసుకొచ్చారు... ఎంతో సపోర్ట్ చేశారు' అంటూ వైష్ణవి ఎమోషనల్ స్పీచ్ ...

08:53 AM Jul 13, 2023 IST | Sowmya
Updated At - 08:53 AM Jul 13, 2023 IST
vaishnavi chaitanya    నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేని టైంలో బేబీ సినిమా తీసుకొచ్చారు    ఎంతో సపోర్ట్ చేశారు  అంటూ వైష్ణవి ఎమోషనల్ స్పీచ్
Advertisement

Vaishnavi Chaitanya : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయి స్టేజిపైనే ఏడ్చేసింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. బేబీ ఒక రియాలిటీ స్టోరీ. మన చుట్టూ ఉండే కథల్లోంచి తీసుకున్న స్టోరీ. చిన్న చిన్న క్యారెక్టర్స్, యూట్యూబ్ లో దొరికిన షార్ట్ ఫిలిమ్స్ అన్ని చేసుకుంటూ వచ్చాను. అలంటి టైంలో నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేని టైంలో డైరెక్టర్ సాయి రాజేష్ గారు బేబీ సినిమా తీసుకొచ్చారు. నాలో బేబీ క్యారెక్టర్ చూశాను అన్నారు. నాలోంచి భయం పోగొట్టారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్క అవకాశం వచ్చింది అనిపించింది.

Advertisement GKSC

.ఒక యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చాలామంది చాలా మాటలు అన్నారు. ఈ సినిమాతో ఆ మాటలకి సమాధానం చెప్పాలి అనిపించింది. డైరెక్టర్ సాయి రాజేష్ గారే నాకు ఇందుకు ఫుల్ సపోర్ట్ చేశారు. మా అమ్మ నాన్న నాకు జన్మ ఇస్తే మీరు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. కానీ నిర్మాత SKN గారు, డైరెక్టర్ సాయి రాజేష్ సపోర్ట్ చేశారు అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేసింది.

Advertisement
Author Image