For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో "వైష్ణవ జనుడవు నీవే అయితే" గీతం ప్రతిధ్వనిస్తుండేది: డాక్టర్ కమలా రామన్.

02:12 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:12 PM May 11, 2024 IST
మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో  వైష్ణవ జనుడవు నీవే అయితే  గీతం ప్రతిధ్వనిస్తుండేది  డాక్టర్ కమలా రామన్
Vaishnava Janudavu Neeve ite Mahatma Gandhi Prayer, Sri Venkat Trust,Dr Kamala Raman,
Advertisement

"వైష్ణవ జనుడవు నీవే అయితే" జాతిపిత మహాత్మాగాంధీ ప్రార్థనాగీతం ఆవిష్కరణ !!

గీత రచన: డాక్టర్ కమలా రామన్
సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్
గానం: ఉన్నికృష్ణన్-ఉష

Advertisement GKSC

మహాత్మాగాంధీ తన దినచర్యలో భాగంగా ఓ ప్రార్ధనాగీతం ఆలపించేవారు. 14 వ శతాబ్దంలో.. నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాసిన గీతమిది. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది. ఈ గీతాన్ని తెలుగులో రాసి విడుదల చేశారు శ్రీ వెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ కమలా రామన్.
'ఆనంద్, గోదావరి, చందమామ' వంటి సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్ స్వర సారధ్యం వహించిన ఈ ప్రార్ధనాగీతానికి... ప్రముఖ గాయనీమణి ఉషతో కలిసి సుప్రసిద్ధ గాయకులు ఉన్నికృష్ణన్ గాత్రమందించారు.
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో గీత రచయిత్రి-శ్రీవెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీమతి కమలా రామన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వజ, బ్రిగేడియర్ వి.శ్రీనివాసరావు, దైవజ్ఞశర్మ, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కేశవులు, ఆలిండియా డైరెక్టర్ ఉదయ్ శంకర్ అతిధులుగా పాల్గొని... కమలా రామన్ కృషిని ప్రశంసించారు.
సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్, గాయని ఉష, శ్రీవెంకట్ ట్రస్ట్ ప్రతినిధులు సూర్య కమల, ప్రేమ్ చంద్, శివ దండపాణి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు!

Advertisement
Author Image