తన పుట్టినరోజు సందర్భంగా పాతికవేల కుటుంబాలకు అండగా నిలుస్తున్న ప్రముఖ హీరో "మంచు మనోజ్"
Tollywood Top Hero Manchu Manoj Disrtibuting Daily Groceries to 25 Thousand Families on His Birthday, Covid News, Corona News,
తన పుట్టినరోజు సందర్భంగా పాతికవేల కుటుంబాలకు అండగా నిలుస్తున్న ప్రముఖ హీరో "మంచు మనోజ్"
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో పాతికవేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేయనున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. మే 20 హీరో మంచు మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మనోజ్.
‘‘కోవిడ్ భాదితులు మెరైగన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం.. ఇలా కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి భయటపడుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా ఈ లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందిపడుతున్న పాతిక వేల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాం. దయచేసి అందరు ఇంట్లోనే ఉడండి. కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండండి కానీ కోవిడ్ పాజిటివ్ తెచ్చుకోకండి’’
ప్రేమతో మీ మనోజ్ మంచు.