Em Chesthunnav : హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా 'ఏం చేస్తున్నావ్' టీజర్ గ్రాండ్ రిలీజ్
NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఏం చేస్తున్నావ్'. యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నటీనటులు : విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని, అమిత రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాల, మధు తదితరులు
రచన దర్శకత్వం: భరత్ మిత్ర
నిర్మాత: నవీన్ కురువ, కిరణ్ కురువ
సహానిర్మాత: హేమంత్ రామ్ సిద్ధ
బ్యానర్:NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్
సంగీత దర్శకుడు: గోపి సుందర్
సినిమాటోగ్రాఫర్: ప్రేమ్ అడవి
ఎడిటర్: హరీష్ శంకర్TN
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ సామల
ఆర్ట్ డైరెక్టర్: గణేష్
కో డైరెక్టర్: రామ్ GV
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: కొండ నాయుడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ నాయుడు అల్లం
డిజిటల్ పీఆర్ఓ: మురళి కృష్ణ సురపనేని
పీఆర్ఓ: హరీష్, దినేష్