Entertainment : ఒక్కో సినిమాకు మన హీరోలు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..
Entertainment టాలీవుడ్.. దేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో కొనసాగతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సిరీస్, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు చిత్రసీమ మార్కెట్ ఎవ్వరు అందుకోలేనంత రేంజ్కి ఎదిగిపోయింది. అలానే మన హీరోలు తమ పాన్ ఇండియా క్రేజ్తో తమ రెమ్యునరేషన్లు కూడా ఫుల్గా పెంచేశారు. మరి టాప్ లిస్ట్లో ఉన్న మన హీరో, హీరోయిన్లు ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం..
ప్రభాస్.. ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయిలు ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఒక్కో సినిమాకి 80కోట్ల నుండి 100 కోట్లు వరకు తీసుకున్నట్లు సమాచారం
2. మహేష్ బాబు
సర్కారు వారి పాటతో సూపర్ హిట్ను అందుకున్న సూపర్స్టార్ మహేశ్ బాబు ఒక్కో సినిమాకి 70 కోట్లు తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.
3. పవన్ కల్యాణ్.. భీమ్లానాయక్తో పలకరించిన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి రూ.50 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నట్టు సమాచారం.
4. జూనియర్ యన్ టి ఆర్
ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయితో క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన రెమ్యునరేషన్కు రూ.50కోట్లకు పెంచారట.
5. అల్లు అర్జున్
పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ రూ.40 కోట్లు డిమాంట్ చేస్తున్నారట.
6. రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆరే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నారు. ఒక్కో చిత్రానికి రూ.40 కోట్లు తీసుకుంటున్నారట.