For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Lessons From Legends - Un Stoppables - 02: అసలు ఇది ప్రమాదకర ప్రాజెక్ట్ ఎందుకు? 

09:02 AM Dec 30, 2021 IST | Sowmya
Updated At - 09:02 AM Dec 30, 2021 IST
lessons from legends   un stoppables   02  అసలు ఇది ప్రమాదకర ప్రాజెక్ట్ ఎందుకు  
Advertisement

250 కోట్లు పెట్టుబడి పెట్టడంలో సమస్య ఏమిటి? సినిమా సక్సెస్ అయినప్పటికీ, నిర్మాతలకు లాభాలు రావు అన్నారు. వారు ఎందుకు అలా అన్నారు ? వారు సినిమా వ్యాపారం యొక్క నిపుణులు. వాళ్లు అలా అన్నారు అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి.

మొదటిది, ఏదైనా సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్ , డైరెక్టర్, యాక్టర్  నార్త్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడం అనేది చాలా ప్రమాదకరమైన విషయంగా, ఎంతో రిస్క్ తో కూడినటువంటి అంశం గా భావిస్తారు. సక్సెస్ రేట్ చాలా తక్కువ. రజనీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం మరియు ప్రియదర్శన్ లాంటి చాలా కొద్ది మంది  సౌత్ ఇండియన్ డైరెక్టర్ లు మరియు యాక్టర్ లు మాత్రమే బాలీవుడ్లో తమదైన ముద్ర వేశారు.

Advertisement GKSC

రెండవది, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ అడ్డంకులు ఉన్నాయి. ప్రాంతీయ సినిమాలు వారి వారి స్వంత ప్రాంతంలో మాత్రమే బాగా ఆడతాయి. మీరు ఒక హిందీ సినిమా తీసుకొని తమిళం మరియు తెలుగు భాషలోకి డబ్ చేస్తే అది తెలుగు తమిళ భాషల్లో ఆడకపోవచ్చు. మీరు ఒక ప్రాంతీయ చిత్రం తమిళం లేదా తెలుగు చెందిన ప్రాంతీయ చిత్రాన్ని తీసుకొని హిందీలోకి డబ్ చేస్తే అది అక్కడ బాలీవుడ్ లో ఆడకపోవచ్చు. ప్రాంతీయ సినిమాలు  నేషనల్ మరియు ఇంటర్నేషనల్  లెవెల్ లో సక్సెస్ అవ్వటం అనేది  అంత తేలికైన విషయం ఏమి  కాదు. సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకులు, షారూఖ్ ఖాన్ లాంటి హీరోలు  కొంతమంది పెద్ద ఈవెంట్ సినిమాలు తీయడం అప్పటికే ఇతర భాషలలో పెద్దగా పని చేయలేదు. తమ మార్కెట్ పెంచుకుందామని వేరే ప్రాంతాలలో కూడ విజయం సాధించాలని చాలామంది దర్శకులు, నటులు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ రేట్.

చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. రాజమౌళికి కూడా వ్యక్తిగతంగా ఇది చాలా బాగా తెలుసు. రాజమౌళి మునుపటి 2012 ఫిల్మ్ "ఈగ" డబ్బింగ్ వెర్షన్ " మక్కి " ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించింది. బాలీవుడ్ లో ఎంతో అటెన్షన్ ని  రాబట్టింది. కంటెంట్ మరియు విజువల్స్ చాలా బాగున్నప్పటికీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద "ఈగ" పెద్దగా ఎగరలేకపోయింది. Tollywood Industry Seniors About Director SS Rajamouli Movies, RGV, Analysis Lessons From Legends Unstoppables, Telugu World Now.telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.మూడవది, మొత్తం బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్స్ లో నిర్మాతకి ఎంత వాటా ఉంటుంది ? అసలు నిర్మాతకి లాభాలు ఎలా వస్తాయ్ ? ఎంత వస్తాయ్ ?  అసలు సినిమా వ్యాపారం అనేది ఎలా పనిచేస్తుంది ? అనేది మనం తెలుసుకోవాలి. అసలు బాక్స్‌ ఆఫీస్‌ బిజినెస్ మోడల్‌, ఎలా పనిచేస్తుంది ? మొదటగా మనం కొన్ని పదాల గురుంచి తెలుసుకోవటంతో మొదలుపెడదాం. To be Continued...

Advertisement
Author Image