Entertainment : చలపతిరావు మృతి పై సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు...
Entertainment 78 ఏళ్ల వయసులో టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు గత రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే అయితే ఆయన మరణాన్ని టాలీవుడ్ సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకు కాను తమ బాధను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు.. ఈ విషయంపై చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ బాలకృష్ణ వంటి వారి అందరూ తమ సంతాపాన్ని తెలియజేశారు...
విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.. ' చిరంజీవి
‘చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. చలపతిరావు గారు తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. నిర్మాతగా కూడా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో చలపతిరావు గారికి అవినాభావ సంబంధం వుంది. నాన్నగారితో కలసి అనేక చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు. చలపతిరావు గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. బాలకృష్ణ
"చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’ ఎన్టీఆర్