Entertainment : సందీప్ కిషన్ రెజీనా కసాండ్రా డేటింగ్ లో ఉన్నారా.. !
Entertainment టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరి విషయం చర్చనీయంశంగా మారింది..
సందీప్ కిషన్, రెజీనా డేటింగ్ లో ఉన్నారంటూ నెట్టింట తెలుగు హల్చల్ చేస్తున్నాయి గతంలో వీరిద్దరూ క్లోజ్ గా ఉంటున్నారు అంటూ ప్రచారం సాగగా తాజాగా వీరు వ్యవహారం మరొకసారి చర్చకు దారి తీసింది.. తాజాగా రెజీనా కసాండ్రా పుట్టిన రోజు వేడుకులను సందీప్ కిషన్ రెజీనాకు చాలా దగ్గరి వ్యక్తిలాగా విష్ చేస్తూ ఓ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే పాప. లవ్ యూ. అన్ని విషయాల్లో ఎప్పుడూ నీకు మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే రెజీనాతో సందీప్ క్లోజ్ గా ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఫొటోలో రెజీనా కూడా సందీప్ తో చనువుగా కనిపించింది. ఈక్రమంలో వీరిద్దరూ డేటింగ్ నిజమే అంటూ నెట్టింట రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు
శర్వానంద్ హీరో గా నటించిన ‘ప్రస్థానం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సందీప్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘బీరువా’ వంటి హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అలాగే రెజీనా సందీప్ కంటే ముందే కేరీర్ ను ప్రారంభించి తెలుగు, తమిళం చిత్రాలలో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. వీరిద్దరూ కలిసి ‘రారా క్రిష్ణయ్య’, ‘నక్షత్రం’ చిత్రాల్లో కలిసి నటించారు..