For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhakthi : తిరుమల అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. చూసి మైమరిచిపోతున్న భక్తులు..

12:41 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:41 PM May 13, 2024 IST
bhakthi   తిరుమల అద్భుత దృశ్యం ఆవిష్కృతం   చూసి మైమరిచిపోతున్న భక్తులు
Advertisement

Bhakthi కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుపతి భక్తులకు ఎప్పుడు ప్రత్యేకమే ఇక్కడ ఎప్పటికప్పుడు ఆ స్వామి దయతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి అయితే తాజాగా మాండస్‌ తుపాను ప్రభావంతో.. తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శేషాచలం కొండ నుంచి వస్తున్న వరద కపిల తీర్థం జలపాతానికి చేరుతోంది. దీంతో కపిల తీర్థం వద్ద జలపాతం భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పరవళ్లు తొక్కుతున్న వరద సుందరంగా కనిపిస్తోంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు.. ఈ జలపాతాన్ని చూసి ఆనందంతో పరవశించిపోతున్నారు. కొండ పైనుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసి పులకించిపోతున్నారు.

చిత్తూరు జిల్లా తిరుపతికి ఉత్తరంగా తిరుమల కొండల్లో ఆనుకొని ఉన్న శేషాద్రి కొండ దిగువ భాగంలో ఉంది ఈ కపిల తీర్థం.. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని.. వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని పిలుస్తుంటారు. శేషాద్రి కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి.. ఆలయ పుష్కరణిలోకి నీరు జలపాతం రూపంలో ప్రవహిస్తుంది. ఆకాశగంగను తలపిస్తున్న కపిలతీర్థం అందాలను వీక్షించడానికి పర్యాటకులు పోటెత్తుతారు. ఈ సీజన్‌లో తిరుపతికి వచ్చే వారిని ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ప్రస్తుతం అలిపిరి నుంచి చూసినా.. ఏడు కొండల పైనుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాలు చూసి జనాలు మై మరిచిపోతున్నారు. అలాగే స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చి ఈ అద్భుత దృశ్యాలను కనుల నిండుగా చూసి ఆశ్చర్యపోతున్నారు.. అలాగే తిరుమలలో వచ్చిన భక్తులు దర్శించుకుని పాపవినాశనం శిలాతోరణం ఈ వరదల కారణంగా మూసివేశారు..

Advertisement GKSC

Advertisement
Author Image