Entertainment : విడుదలకు ముందు పైరసీకి గురైన మన సినిమాలు..
Entertainment సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో కనిపిస్తే ఆ నిర్మాతలకు భయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇలాంటి సంఘటన ఇప్పటికే టాలీవుడ్లో పలు సినిమాలు ఎదుర్కొన్నాయి దీనివల్ల నిర్మాతలు ఎంతగానో నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే కొన్ని చిత్రాలు మాత్రం పైరసీకి గురైన ఆన్లైన్లో విడుదలకు ముందే కనిపించిన చిత్రాలు మాత్రం కమర్షియల్ గానే హిట్ అయ్యాయి. అంతేకాదు ప్రేక్షకుల నుంచి మంచి టాక్నే సంపాదించుకున్నాయి మరి అలాంటి చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన అవతార్ 2 చిత్రం కూడా ఈ పైరసీని ఎదుర్కొంది. సినిమా విడుదలకు ముందు రోజు ఆన్లైన్లో దీని ప్రింట్ ఉండటం అందరిని షాక్కు గురి చేసింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఎవడు చిత్రం.. తమిళ హీరో విజయ్ మాస్టర్ మూవీ.. విడుదలకు ముందే పైరసీ బారిన పడ్డాయి... బాలీవుడ్ చిత్రం ఉడ్తా పంజాబ్.. అమితాబ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పా చిత్రం.. బాలీవుడ్ మూవీ మాంఝీ.. ఇవన్నీ కూడా విడుదలకు ముందే పైరసీ బారిన పడ్డాయి...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం 2013లో విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలకు 20 రోజుల ముందే ఫస్ట్ ఆఫ్ మొత్తం లీక్ అయిపోయి అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. అలాగే 2004లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో కొన్ని సీన్స్ కూడా విడుదలకు ముందే లీక్ అయిపోయాయి.. అలాగే దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి చిత్రానికి కూడా పైరసీ బాధ తప్పలేదు. ఫస్ట్ పార్ట్ లోని క్లైమాక్స్ తో పాటు మరికొన్ని సీన్లు రెండో భాగం లోని ఓ యాక్షన్ సీన్ కూడా విడుదలకు ముందే రిలీజ్ అయిపోయింది. రజినీకాంత్ కాలా చిత్రం 2018లో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్ అంత నెట్లో ప్రత్యక్షమై అందరిని షాక్కు గురి చేసింది..