For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఆడ‌వాళ్ళు, మ‌గ‌వాళ్ళు అనే తేడా లేదు... అంద‌రూ స‌మాన‌మే: రామ్‌ చ‌ర‌ణ్

11:04 PM Jan 26, 2022 IST | Sowmya
Updated At - 11:04 PM Jan 26, 2022 IST
film news  సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఆడ‌వాళ్ళు  మ‌గ‌వాళ్ళు అనే తేడా లేదు    అంద‌రూ స‌మాన‌మే  రామ్‌ చ‌ర‌ణ్
Advertisement

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందిన‌ ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో పార్క్ హ‌య‌త్ లో `గుడ్ లక్ సఖి` ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ముఖ్య అతిధిగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యారు. రిప‌బ్లిక్ డేనాడు జ‌రిగిన ఈ వేడుక‌లో చిత్రంలో సంద‌ర్భానుసారంగా వ‌చ్చే `ఎగిరే తిరంగ జెండాల త‌ల ఎత్తి దించ‌కుండా..` పాట‌ను రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రించారు. బిగ్ టిక్కెట్‌నూ విడుద‌ల చేశారు.

Advertisement GKSC

ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ... నేను అతిథిగా రాలేదు. నాన్న‌గారి దూత‌గా వ‌చ్చాను. ఆయ‌న ఆశీస్సులు తెలియ‌ప‌ర్చ‌డానికి వ‌చ్చాను. యంగ్ నిర్మాత‌లు శ్రావ్య‌, సుధీర్ ఈ స్థాయికి చేర‌డం మామూలు విష‌యం కాదు. యంగ్ టెక్నిక‌ల్ టీమ్ ప‌నిచేశారు. న‌గేష్ నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్‌. కెమెరామెన్‌, కీర్తి ఇలా ఇంత‌మంది క‌లిసి ప‌నిచేయ‌డం మామూలు విష‌యం కాదు. అందుకే వీరి క‌ల‌యిలో సినిమా బాగుంటుంది. నా కాలేజీ డేస్‌లో న‌గేష్ గారి సినిమా చూశాను. మ‌నం ఇప్పుడు ఓటీటీ చూసి ఎంజాయ్ చేస్తున్నామో న‌గేష్ గారు ఎప్పుడో అది ఓపెన్ చేశారు. ఇక్బాల్‌, హైద‌రాబాద్ బ్లూస్ వంటి సినిమాలు అందుకు నిద‌ర్శ‌నాలు. ఇక ఇంత మంది దిగ్గ‌జాలు వుండ‌గా చిన్న సినిమా కాదు. చాలా మీనింగ్ ఫుల్ సినిమా అని నాకు అనిపిస్తుంది. అంద‌రికీ లైట్‌హౌస్‌గా దేవీశ్రీ‌ప్ర‌సాద్ వున్నారు. రంగ‌స్థ‌లం, ఎవ‌డు సినిమాల‌కు ప‌నిచేశారు. There is no difference between men and women in the film industry - Kirti Suresh 'Good Luck Sakhi' Ramcharan at the pre-release ceremony,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఆడ‌వాళ్ళు, మ‌గ‌వాళ్ళు అనే తేడాలేదు. ఇప్పుడు ఏ బోర్డ‌ర్ లేకుండా ఇండియ‌న్ సినిమా అని రాజ‌మౌళి వ‌ల్ల పేరు తెచ్చుకుంది. ఇండియ‌న్ సినిమాలో ఆడ‌, మ‌గ క‌లిసి ప‌నిచేస్తున్నారు. అంద‌రూ ఒక్క‌టే. ఆది పినిశెట్టి రంగ‌స్థ‌లంలో మా అన్న‌గా చేశారు. ఎంత‌గానో ఆక‌ట్టుకునే ప‌లికించింది. ఇక మ‌హాన‌టిలో కీర్తి త‌ప‌న న‌చ్చింది. అలా నేష‌న‌ల్ అవార్డు ద‌క్కించ‌కోవ‌డం గ్రేట్‌. ఇలాంటి క‌థ‌లు మీరే చెప్పాలి. ఈనెల 28న సోలో రిలీజ్ దొర‌క‌డం మంచి విజ‌యం చేకూరుతుంద‌ని భావిస్తున్నా. కీర్తి అభిమానుల‌తోపాటు మా అభిమానులు కూడా సినిమా చూడండ‌ని పేర్కొన్నారు. అనంత‌రం మ‌హా న‌టి కీర్తి కోసం ఆర్‌.ఆర్‌.ఆర్‌.లోని నాటునాటు.. సాంగ్‌ను రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి డాన్స్ చేసి అల‌రించారు.

Advertisement
Author Image