For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: యుద్ద నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమ కథ 'విరాట పర్వం' సినిమా

02:17 PM Dec 20, 2021 IST | Sowmya
Updated At - 02:17 PM Dec 20, 2021 IST
film news  యుద్ద నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమ కథ  విరాట పర్వం  సినిమా
Advertisement

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి కలిసి న‌టిస్తోన్నచిత్రం విరాట పర్వం. ఇది వరకు ఎన్నడూ పోషించ‌ని పాత్రలో రానా, సాయి ప‌ల్లి ఈ సినిమాలో కనిపించబోతోన్నారు. ఇప్ప‌టికే విడుదల చేసిన విరాట పర్వం టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన లభించింది.

1990 ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. అతని కలం పేరు అరణ్య. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్‌లో సాయి పల్లవి నటించారు. యుద్ద నేపథ్యంలో అందమైన ప్రేమ కథను ఈ విరాట పర్వం సినిమాలో చూపించబోతోన్నారు.

Advertisement GKSC

రానా బర్త్ డే సందర్బంగా వాయిస్ ఆఫ్ రవన్న అంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇక ఇందులో రవన్న ఇచ్చిన ప్రసంగం అందరినీ ఉత్తేజ పరిచేలా ఉంది.

‘మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే.. చలో చలో చలో పరిగెత్తు.. అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు.. చలో చలో పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండని వెలిగిద్దాం.. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. చలో చలో పరిగెత్తు.. దొరొల్ల తలుపుల తాళంలా.. గఢీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు.. చలో పరిగెత్తు’ అంటూ రవన్న పాత్రలో రానా చెప్పిన డైలాగ్స్ హైలెట్ అవుతున్నాయి.

ఈ వీడియోలో రానా ప్రయాణం, యుద్దం మధ్యలో సాయి పల్లవితో ప్రేమాయణం, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సంక్రాంతికి ట్రైలర్ రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

The Voice Of Ravanna From Rana, Sai Pallavi, Nanditha Das, Director Venu Udugula’s Virata Parvam Out, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com

నటీనటులు : రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావ్, సాయి చంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి తదితరులు

సాంకేతికబృందం :

రచయిత, దర్శకుడు : వేణూ ఊడుగుల
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సమర్పణ : సురేష్ బాబు
డీఓపీ : డానీ సాంచేజ్ లొపేజ్, దివాకర్ మణి
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీ నాగేంద్ర
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
స్టంట్స్ : స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్
కొరియోగ్రఫీ : రాజు సుందరం
పీఆర్వో : వంశీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్ చాగంటి
పబ్లిసిటీ డిజైన్ : ధని ఏలె

Advertisement
Author Image