For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#LIGER : విజయ్ సూపర్ హ్యాండ్సమ్, అనన్య నాజూకు అందాలు

03:50 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:50 PM May 11, 2024 IST
 liger   విజయ్ సూపర్ హ్యాండ్సమ్  అనన్య నాజూకు అందాలు
Advertisement

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ 'లైగర్' (సాలా క్రాస్‌బ్రీడ్) మూడో సింగిల్ 'ఆఫత్' మ్యూజిక్ వీడియో విడుదల

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు.

Advertisement GKSC

ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్- 'అక్డీ పక్డీ ', వాట్ లగా దేంగే సినిమాపై  భారీ హైప్ , అంచనాలను పెంచాయి. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో మూడవ పాట - ఆఫత్ తాజాగా విడుదలైయింది.

అందమైన బీచ్ హౌస్‌ నేపధ్యంలో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. రమ్యకృష్ణ తన కొడుకు విజయ్ దేవరకొండకు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండమని చెప్పడం, విజయ్, అనన్య ఇంటి నుండి బయటకు వచ్చి బీచ్‌కి వెళ్ళడం లవ్లీగా వుంది.

విజయ్, అనన్యల కెమిస్ట్రీ సిజిలింగ్ గా వుంది. విజయ్ సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తుంటే అనన్య నాజూకు అందాలు ఆకట్టుకున్నాయి. డాన్స్ లు కూడా అందంగా వున్నాయి.  తెలుగు పాటని సింహా, శ్రావణ భార్గవి అలపించిన తీరు అద్భుతంగా వుంది. The Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Third Single 'Aafat' Music video Out now,Ananya Panday,Telugu Golden TV,v9 News Telugu,www.teluguworldnow.com,my mix entertainments.1భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు అందించిన యూత్ ఫుల్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు తనిష్క్ బాగ్చి అద్భుతమైన సంగీతాన్ని అందించగా, పియూష్-షాజియా కొరియోగ్రఫీ బ్రిలియంట్  గా వుంది. అజీమ్ దయాని మ్యూజిక్ సూపర్‌వైజర్.  ఆఫత్ పాట ఆడియోతో పాటు విజువల్స్‌తో మెస్మరైజ్ చేసిన అందమైన బీచ్ సాంగ్ గా ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే సినిమాలోని లవ్ ట్రాక్‌ యూత్ ని క్రేజీగా అలరిస్తుందని అర్ధమౌతుంది.

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలౌతుంది.

Advertisement
Author Image