For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Dil Se : 'దిల్ సే' ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది : డైరెక్టర్ బాబీ కొల్లి

09:08 PM Sep 13, 2023 IST | Sowmya
Updated At - 09:08 PM Sep 13, 2023 IST
dil se    దిల్ సే  ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది   డైరెక్టర్ బాబీ కొల్లి
Advertisement

రాజా విక్రమ్ ప్రధాన పాత్రలో భరత్ నరేన్ దర్శకత్వంలో శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్ పై  శ్రీధర్ మరిసా నిర్మించిన చిత్రం ‘దిల్ సే’. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దిల్ సే ట్రైలర్ ని లాంచ్ చేశారు. దర్శకుడు భరత్ నరేన్ యూత్ ఫుల్ అండ్ యునిక్ లవ్ స్టొరీతో ‘దిల్ సే’ ని ప్రజంట్ చేశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. కాన్సప్ట్ చాలా డిఫరెంట్ గా వుంది. మాస్క్ వేసుకున్న అమ్మాయి ఎవరు? అనే క్యురియాసిటీ ట్రైలర్ చూసిన అందరికీలో కలిగింది. ట్రైలర్ యంగేజింగ్ అండ్ ఫన్ ఫుల్ గా వుంది. రాజా విక్రమ్ చాలా యీజ్ తో చక్కని నటన కనబరిచారు. నటీనటులంతా ఆకట్టుకున్నారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ప్లజంట్ గా వున్నాయి. ట్రైలర్ సిరిస్ పై క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ కొల్లి మాట్లాడుతూ.. 'పవర్' సినిమా విడుదలైనప్పటి నుంచి భరత్ పరిచయం. దిల్ సే ట్రైలర్ చాలా బావుంది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. ట్రైలర్ లో చూస్తుంటే అందరిలోనూ ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. రాజా విక్రమ్ ని చూస్తుంటే నా మొదటి సినిమా గుర్తుకు వచ్చింది. తను తప్పకుండా నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని కోరుకుంటుకున్నాను. భరత్ కి ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూసి అందులో అమ్మాయి ఎవరని అడిగాను. నాకు నా వైఫ్ కి తప్పితే యూనిట్ లో ఎవరికీ చూపించలేదని చెప్పాడు. అందరికీ థ్రిల్ సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఈ కన్విక్షన్ చాలా నచ్చింది . అదే ఈ సినిమాకి ప్రేత్యకతని తీసుకొచ్చింది. అలాంటి పాత్రని నమ్మి చేసిన అమ్మాయికి ఆల్ ది బెస్ట్. విన్ ఓటీటీ ఫ్లాట్ ఫాం తో యువ ప్రతిభావంతులందరినీ ప్రోత్సహిస్తున్న రామోజీరావు గారికి, బాపినీడు గారి ధన్యవాదాలు. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అందరి కళ్ళల్లో విజయం సాధిస్తామనే నమ్మకం కనిపిస్తోంది. దిల్ సే ఖచ్చితంగా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కొరుకుంటున్నాను’’

Advertisement GKSC

Advertisement
Author Image