For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'చండిక' ఆరంభం

07:19 PM Jun 15, 2023 IST | Sowmya
Updated At - 07:19 PM Jun 15, 2023 IST
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్  చండిక  ఆరంభం
Advertisement

వీరు, శ్రీహర్ష హీరోలుగా, కుషీచౌహన్, నిషాసింగ్, హీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం "చండిక". తోట కృష్ణ దర్శకుడు. కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంబించారు. దీనికి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ ప్రారంబోత్సవానికి హాజరై, చిత్ర బృందానికి శుభాకంక్షాలు అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.వి.పాపారావు మాట్లాడుతూ... ఈ చిత్రానికి తానే ఒక మంచి కథను అందించానని, భవిష్యత్తులో కోటిపల్లి ప్రొడక్షన్ సంస్థను ఒక పెద్ద సంస్థగా ఎదిగేలా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతిభ గల వారినెందరినో పరిశ్రమకు పరిచయం చేయాలన్నదే తమ సంస్థ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదని, చాలా సినిమాలలో విలన్ పత్రాలు పోషించిన శ్రీహర్ష ఈ సినిమాలో రెండవ హీరోగా కీలక పాత్రలో నటిస్తున్నారు, హైదరాబాద్ పరిసరాల్లోని చేవెళ్ల దగ్గర ఓ ఫామ్ హౌస్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీయడం మొదలు పెట్టామని తెలిపారు.

Advertisement GKSC

వర్ధమాన నటులు శేషాద్రి, జబర్దస్త్ కార్తీక్;లతో పటు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: సాయినాధ్, మాటలు: వెంకటేష్,సినిమాటోగ్రఫీ: నగేష్, సంగీతం: చేతన, ఎడిటింగ్: శ్రీనివాస్, నిర్మాత కె.వి.పాపారావు, దర్శకత్వం: తోట కృష్ణ

Advertisement
Author Image