తన జన్మదినం సందర్భంగా “కోటి వృక్షార్చన” లో రుద్రాక్ష మొక్క నాటిన సీఎం కేసిఆర్
“కోటి వృక్షార్చన” లో భాగంగా రుద్రాక్ష మొక్క నాటిన కేసిఆర్
గౌరవనీయులు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది.
ఇందులో భాగంగా, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ప్రార్ధన మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొని రుద్రక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని అభినందించారు.
The Legend himself participated #KotiVruksharchana programme by planting #Rudraksha plant marking his #Birthday. Such a lovely gesture shown by the visionary himself. This will sure be inspiring many souls towards improving green cover across the #Telanagana and beyond