For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కృష్ణ గారి 300 సినిమాల విశేషాలతో రాసిన 'కృష్ణ చిత్ర' అనే పుస్తకమే నన్ను ఒక జర్నలిస్ట్ గా నిలబెట్టింది : సురేష్ కొండేటి

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
కృష్ణ గారి 300 సినిమాల విశేషాలతో రాసిన  కృష్ణ చిత్ర  అనే పుస్తకమే నన్ను ఒక జర్నలిస్ట్ గా నిలబెట్టింది   సురేష్ కొండేటి
Advertisement

సూపర్ స్టార్ కృష్ణ మరణించారు అనే విషయం తెలిసిన వెంటనే సంతోషం అధినేత సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని అయిన సురేష్ కొండేటి కృష్ణ గారి మరణ వార్త విన్న వెంటనే షాక్ కి గురయ్యారు.. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు.
" నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి అభిమానిని. ఆయన సినిమాలు చూసి ఆయనకు అభిమానిగా మారిపోయాను తెలుగు సినిమాల్లో తొలి డిటిఎస్ సినిమా, తొలి 70 స్కోప్ సినిమా, తొలి ఈస్ట్ మన్ కలర్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి డిటెక్టివ్ టైప్ సినిమా, ఇలా అన్ని ఆయనే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేవారు.

ఆయన సాహసాలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో సాహసం చేయాలంటే కృష్ణ తర్వాతే ఎవరైనా చేసేవారు. అవన్నీ చూస్తూ పెరిగిన నేను స్కూలు రోజుల నుంచే ఆయన అభిమానిగా మారిపోయాను. అయితే నేను సినీ పరిశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత కృష్ణ గారి పేరుతో ఉన్న కృష్ణా పత్రిక అనే పత్రికలో ఆయన పేరు ఉన్న కారణంగానే నేను జాయిన్ అయ్యాను. కృష్ణ గారి పేరుతో ఉంది కాబట్టి కృష్ణ గారి సపోర్ట్ ఉంటుందని భావించాను కానీ అప్పటికి అసలు కృష్ణ పత్రికలో సినిమా వార్తలే రాసేవారు కాదు. కానీ అప్పటి ఎడిటర్ పిరాట్ల వెంకటేశ్వరరావు గారు నన్ను ప్రోత్సహించేందుకు సినిమా వార్తలు రాసేందుకు ఒక కాలం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సినిమా వార్తలు రాస్తూ సినిమా జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాను.

Advertisement GKSC

సూపర్ స్టార్ కృష్ణ 300వ చిత్రం విడుదల సందర్భంగా 'కృష్ణచిత్ర" అనే ఒక స్పెషల్ బుక్ రిలీజ్ చేసాము. 300 సినిమాలకు సంబంధించిన అనేక విశేషాలు ఆ పుస్తకంలో పొందుపరిచాము. ఆ పుస్తకం ఆవిష్కరణకు చిక్కడపల్లిలో ఉన్న కృష్ణ పత్రిక ఆఫీసుకు సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించి ఒక్కసారిగా తెలుగు జర్నలిస్ట్ లోకానికి నన్ను పరిచయం చేశారు. అప్పటినుంచి నా దశ తిరిగిపోయింది ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఈ కృష్ణ పత్రికలో చేసిన కృష్ణ చిత్ర అనే బుక్ కోసం అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి విదేశాల్లో షూటింగ్లో ఉన్న సమయంలో కూడా నేను ట్రంక్ కాల్ బుక్ చేసి చిరంజీవి గారిని కృష్ణ గారి గురించి అభిప్రాయం కోరగా ఆయన వెంటనే ఒక ఫ్యాక్స్ పంపారు.

The book 'Krishna Chitra' written by Krishna with highlights of 300 films is what set me up as a journalist, Suresh Kondeti,Krishna is Nomore,Telugu Golden TV,telugu world news,www.teluguworldnow.comఇప్పటికీ అది నా దగ్గర పదిలంగా ఉంది. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణతో నా అనుబంధం బాగా పెరిగిపోయింది. ఇప్పటి గేయ రచయిత భాస్కర్ పట్ల రవికుమార్ తో కలిసి అనునిత్యం సూపర్స్టార్ కృష్ణ గారిని కలుస్తూ ఉండే వాళ్ళం. కృష్ణ గారు హైదరాబాదులో గనుక ఉంటే కచ్చితంగా మేమిద్దరం వెళ్లి హాజరు వేయించుకుంటూ ఉండేవాళ్ళం. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిగా సినీ పరిశ్రమలో ఆయనే స్ఫూర్తిగా అడుగు పెట్టిన నాకు ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశాలు ఎన్నో దక్కాయి. విజయనిర్మలగారు ఎన్నోసారి సార్లు తల్లిలా మమ్మల్ని ఆదరించి కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు. ఒక అభిమానికి ఇంకా ఇంతకంటే ఏం కావాలి.

ఆయనేస్ఫూర్తిగా హైదరాబాద్ వచ్చిన నాకు ఆయనతో భోజనం చేసే అవకాశం కలగడం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టమే.. అలాంటి ఆయన ఈరోజు మనకు దూరమయ్యాడనే వార్త విన్న వెంటనే నా గుండె బద్దలైంది, తీవ్ర విషాదం కలిగించింది. అందరూ ఏదో ఒక రోజు ఈ ప్రస్థానాన్ని విడిచి వెళ్లాల్సిందే కదా అనిపించింది. అలాగే ఈరోజు సంతోషం పత్రిక అధినేతగా ఉన్న నేను సంతోషం పత్రిక ప్రారంభిస్తున్న సమయంలో ఇలా ఒక సంతోషం పత్రిక ఏర్పాటు చేస్తున్నానని కృష్ణ గారి దృష్టికి తీసుకువెళ్తే వెన్ను తట్టి అభినందించారు. అలాగే సంతోషం అవార్డుల ఫంక్షన్ చేస్తున్నామని చెబితే ప్రోత్సహించారు. అలాగే సుమారుగా ఆరేడు సార్లు సంతోషం అవార్డుల ఫంక్షన్కు విచ్చేసి నన్ను ఆశీర్వదించారు.

అందులో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారితో కృష్ణ గారు వేదిక పంచుకున్న అపురూప దృశ్యాలను ఇప్పటికీ నా కళ్ళలోంచి తీసేయలేను. సంతోషం తరఫున అందజేసిన ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డు కూడా కృష్ణ గారే అందుకున్నారు. తర్వాత సంతోషం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా కృష్ణ గారు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటారండా ఎన్నో మరపురాని సంఘటనలు ఎన్నో మరుపులాని అనుభవాలు ఆయనతో నాకు ఉన్నాయి. కృష్ణ గారి 300 సినిమాల విశేషాలతో రాసిన కృష్ణ చిత్ర అనే పుస్తకమే నన్ను ఒక జర్నలిస్ట్ గా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది.

ఒక పిఆర్ఓ అయిన నాకు కృష్ణ గారి పిఆర్ఓ బిఏ రాజు తో కలిసి ఎన్నో సందర్భాల్లో కూర్చుని మాట్లాడేవారు. ఒకరకంగా బిఏ రాజు గారి తర్వాత ఆయన అత్యంత సన్నిహితంగా మెలిగిన పిఆర్ఓ నేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఆయన ఎక్కడికి వెళ్లలేదు. ఆయన సినిమాలతో, ఆయన సాహసాలతో ఆయన ప్రయోగాలతో మన మధ్యనే ఉన్నారు, ఉంటారు.

అశ్రు నయనాలతో
కృష్ణ గారి అభిమాని సురేష్ కొండేటి

Advertisement
Author Image