For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: దటీజ్ మెగాస్టార్ చిరంజీవి...!! ఆరోజుల్లోనే పది కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం ?

01:58 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 01:58 PM May 03, 2024 IST
film news  దటీజ్ మెగాస్టార్ చిరంజీవి      ఆరోజుల్లోనే పది కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం
Advertisement

మెగాస్టార్... ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో ఉత్తేజం, ఉత్సాహం ఉరకలెత్తుతాయి. స్టెప్పులంటే మెగాస్టార్, సెన్సేషనంటే మెగాస్టార్...! ఆరేళ్ల వయసున్న వారి నుండీ, అరవై ఏళ్ల వయసువారి వరకూ అందరూ అభిమానించే అతికొద్ది మంది హీరోల్లో చిరంజీవి అంటే అది అతిశయోక్తి కాదు. సాధారణంగా థియేటర్ లో సినిమా ప్రదర్శించ బడుతున్నప్పుడు పాటలు మొదలవగానే ప్రేక్షకులు బయటికెళ్లి రిలాక్స్ అయి వచ్చే సంస్కృతిని తిరగరాసి, పాటలని తప్పు లేచిపోయేలా ఎంజాయ్ చేసేలా చేసిన ఘనత చిరుకే దక్కుతుంది.

అంచెలంచెలుగా ఎదిగి అందనంత ఎత్తులో వున్న మెగాస్టార్ తన కెరీర్లో సాధించిన రికార్డులు ఎన్నో... ఎన్నెన్నో...! అలాంటివాటిలో ఒకటి 'ఘరానా మొగుడు' ఘన విజయం. కన్నడ చిత్రం 'అనురాగ అరళితు' ఆధారంగా తెలుగులో రూపొందిన ఈ చిత్రం అప్పటికీ, ఇప్పటికీ తిరుగులేని సంచలనం. మరీ ముఖ్యంగా చిరంజీవి, డిస్కో శాంతిలతో రూపొందిన 'బంగారు కోడిపెట్ట...' పాట ఎంత ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలిసిందే...! హీరోయిన్లు నగ్మా, వాణీ విశ్వనాథ్ ల అందచందాలు, దర్శకేంద్రుడి మాయాజాలం, జలపాతంలాంటి కీరవాణి సంగీతం కలసి తిరుగులేని విజయాన్ని సాధించే చిత్రంగా 'ఘరానా మొగుడి'ని నిలబెట్టాయి. 1992లో విడుదలైన 'ఘరానా మొగుడు' ఆరోజుల్లోనే పది కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది.That is Megastar Chiranjeevi, Gharana Mogudu Record, Heroine Nagma, Vani Vishwanadh, Tollywood Hit Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com

Advertisement GKSC

Advertisement
Author Image