For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అఖండమైన సినిమాలు వచ్చేలా నన్ను, బోయపాటి శ్రీనుని ఆ దేవదేవుడే కలిపాడు : అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో నందమూరి బాలకృష్ణ

11:28 PM Jan 20, 2022 IST | Sowmya
Updated At - 11:28 PM Jan 20, 2022 IST
అఖండమైన సినిమాలు వచ్చేలా నన్ను  బోయపాటి శ్రీనుని ఆ దేవదేవుడే కలిపాడు   అఖండ అర్థ శతదినోత్సవం వేడుకలో నందమూరి బాలకృష్ణ
Advertisement

అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక జరిగింది. గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్లోని ఆర్.టి.సి. క్రాస్రోడ్లో గల సుదర్శన్ 35.ఎం.ఎం. థియేటర్ ఇందుకు వేదికైంది. ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే బాలకృష్ణ విచ్చేసి అభిమానులను అలరించారు. వారి ఆనందానికి అవధులు లేవు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... ఆర్.టి.సి. క్రాస్ రోడ్కు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. స్టూడియోలో నాన్నగారికోసం టిఫిన్ తీసుకు వచ్చేవాడినంటూ అప్పటి రోజులను ప్రేక్షకులకు తెలియజేశారు. మరోవైపు సమరసింహారెడ్డి శతదినోత్స వేడుకకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. చిత్ర విజయాన్ని గురించి ప్రస్తావిస్తూ,, ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివుడు భక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర నాన్నగారు చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ వాటిని పోషించాను.

Advertisement GKSC

మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణేకాదు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ అఖండ అర్థ శతదినోత్సవం. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా వుంది. ఈ సినిమా విజయాన్ని చేసేలా సహకరించిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హాట్రిక్. మా కలయిక జన్మ జన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు.

మానవ పుట్టుకలో ఒకరో ఇద్దిరినో స్నేహితులుగా ఇస్తారు. కానీ మాకు కోట్లాది మంది అభిమానులను సంపాదించేలా భగవంతుడు చేశాడు. నేను ఏది చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూనే వున్నారు. నాకు నాన్నగారు ఆదర్శం. ఈ అఖండ విజయం తెలుగు చలన చిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమాలో తీసుకున్న అంశం హిందూ సమాజం, ధర్మం, పద్ధతులు. వాటిజోలికి ఎవరైనా వస్తే దేవుడు అఖండలా వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాణనగా ఈ సినిమా వుంది. ఈ సినిమా ఇంత అద్భుతమైన విజయానికి కారకులు అభిమానులు, ప్రేక్షకులే.That God joined me and Boyapati Sreenu to make great movies, Nandamuri Balakrishna at Akhanda Artha Centenary Celebration,telugu golden tv,teluguworldnow.comఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ వరల్డ్ సినిమా. ఇక తమన్ సంగీతం ఈ చిత్రానికి అదరగొట్టేలా చేసింది. రిలీజ్ కాకముందు ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నారు. రిలీజ్ అయ్యాక థమన్ సంగీతంలా అదిరింది అన్నారు. తెలుగు పరిశ్రమ ఇలాగే మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండాలి అని ఆకాంక్షించారు.
అనంతరం యాభైరోజుల జ్ఞాపికలు బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు.

ఫైనల్ గా బాలకృష్ణ మాట్లాడుతూ, అఖండ సినిమాను థియేటర్లలో చూసి ఎంతో పెద్ద ఘనవిజయాన్ని సాధించారు. అదేవిధంగా రేపు సాయంత్రం 6గంటల నుంచి డిస్నీప్లస్ హార్ట్ స్టార్లో కూడా చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.

Advertisement
Author Image