For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది : హీరో శ్రీవిష్ణు

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది   హీరో శ్రీవిష్ణు
Advertisement

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'.  ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. 'అల్లూరి' అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో కుదరలేదు. దానికి ప్రేక్షకులకు క్షమాపణలు. సీనియర్స్ పోలీస్ ఆఫీసర్ కథని ఒక బయోపిక్ లా కీలకమైన సంఘటనలతో ప్రజంట్ చేశాం. ప్రేక్షకుల నుండి కూడా అంతే సిన్సియర్స్ గా  మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ కి విజల్స్ వేస్తున్నారు. నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ కి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.

Advertisement GKSC

'Alluri' is a great inspirational film.. Connects to everyone, Sree Vishnu interview,Telugu Golden TV,v9 news telugu,www.teluguworldnow.com,my mix entertainments,Telugu World newsసెకండ్ హాఫ్ లో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు పేరుపేరునా కృతజ్ఞతలు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పినట్లే చాలా సీనియర్స్ గా సినిమాని ప్రజంట్ చేశారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు నన్ను ప్రేమ ఇష్క్ కాదల్ తో పరిచయం చేశారు. ఆయనతో జర్నీ చాలా బావుంటుంది. చాలా మంచి మనిషి. ఈ  సినిమా చూసిన వాళ్ళు మీ అనుభవాన్ని స్నేహితులకి చెప్పండి. మీడియా, వంశీ-శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాని చూడని వాళ్ళు వెంటనే చూడండి. ఈ సినిమాని అందరూ ఆదరించి ఇంకా పెద్ద సినిమా చేయాలి'' అని కోరారు.

Advertisement
Author Image