For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

WISH YOU A MERRY CHRISTMAS - తాల్ క్రిస్మస్ సంబరాలు 2021 - లండన్

03:12 PM Dec 07, 2021 IST | Sowmya
Updated At - 03:12 PM Dec 07, 2021 IST
wish you a merry christmas   తాల్ క్రిస్మస్ సంబరాలు 2021   లండన్
Advertisement

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) డిసెంబర్ 4 శనివారం రోజు క్రిస్మస్ సంబరాలు ఘనంగా వర్చువల్ గా జూమ్ లో నిర్వహించింది. ఈ
కార్యక్రమంలో లండన్ మరియు యూకేలోని ఇతర ప్రాంతాలకు చెందిన పలు చర్చిలకు సంబంధించి సుమారు 100 మంది తెలుగువారు
మరియు తాల్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా
ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.

లోకల్ ఎంపీ స్టీఫెన్ టీమ్స్ ప్రత్యేక అతిథిగా పాల్గొని సంబరాల్లో పాల్గొన్న వారికి  మరియు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రజలకు క్రిస్మస్
సందేశాన్ని అందించారు. తాల్ గత 15 సంవత్సరాలకు భిన్నంగా గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కోవిడ్19 ప్రత్యేక పరిస్థితులను
దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన సేవా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు.

Advertisement GKSC

తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తాల్ గురించి ప్రస్తావిస్తూ గత 16
సంవత్సరాల నుండి తెలుగు భాష మరియు సంస్కృతిని లండన్ లోని తెలుగు సమాజానికి అందించే సదుద్దేశంతో కృషి చేస్తుందని తెలిపారు.
అలాగే ఈ  క్రిస్మస్ సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రవి మోచర్ల,  జమీమ రత్నాకర్ దార, జస్టిన్, కారోల్ మరియు
డానియల్ విక్టర్ లను ప్రత్యేకంగా అభినందించారు. తాల్ క్రిస్మస్ సంబరాలు 2021 ఆద్యంతం ఘనంగా నిర్వహించేందుకు దోహద
పడ్డవారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

బ్రదర్ డేవిస్ పెనియల్ క్రిస్మస్ ఆరాధనతో కార్యక్రమం ఆరంభించారు. రెవరాండ్ పాల్ గొర్రె మరియు సిస్టర్ జీవ గొర్రె (యుఎస్ఏ), పాస్టర్
డొమినిక్, బ్రదర్ డానియల్ మరియు ఇతర చర్చి నాయకులు, పెద్దలు పాల్గొని   ప్రభువైన యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా పిల్లలకు క్విజ్ మరియు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. లండన్ మరియు యూకేలోని ఇతర ప్రాంతాలకు చెందిన తెలుగు తల్లిదండ్రులు వారి పిల్లలతో క్రిస్మస్ పాటలు మరియు సంగీతంతో వీక్షకులను ఆనందపరిచారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా భారత దేశపు “కల్వరి లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్” నుంచి రెవరాండ్ డాక్టర్  జో మధు మరియు రెవరాండ్
డాక్టర్   వీణ జెస్సి లు పాల్గొని కరోనా కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రత్యేక ప్రార్థనలు జరిపి తమ క్రిస్మస్
సందేశాన్ని అందించారు. ఈ వేడుకల్లో తాళ్ ట్రస్టీలు నవీన్ గాదంసేతి, కిషోర్ కస్తూరి, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, మరియు అనితా నోములా తదితరులు వారితో పాటు ఐటి టీం రిషి కొత్తకోట, వంశీమోహన్ సింగలురి , కిరణ్ కపెట్ట తమ వంతు సహకారాన్ని అందించారు.

Telugu Association of London (TAL) has celebrated Christmas Celebrations 2021 UK, London Virtual Event,Mr. Kishore Kasturi TAL,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement
Author Image