Politics : తెలంగాణలో షర్మిల పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు..
Politics వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని సంఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో విధించిన షరతులు మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే అని స్పష్టం చేసింది..
వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణలో చేస్తున్న పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది.. అలాగే గతంలో విధించిన షరతులు గుర్తుంచుకోవాలని సూచించింది. అలాగే ఈ నేపథ్యంలో షర్మిల తరపు న్యాయవాది వరప్రసాద్ వినిపించిన వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగించేలా అనుమతులు ఇచ్చింది..
అలాగే కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అనుమతి ఎలా నిరాకరిస్తారన్నారని హైకోర్టు ప్రశ్నించింది.
అయితే తాను తెలంగాణలో నిర్వహిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని షర్మిల తాజాగా కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలో విచారణ జరిపించిన హైకోర్టు ఆమె పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. అలాగే ఇది తీర్పు నేపథ్యంలో లేవటస్పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ బలగాలు మోహరించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.. ప్రగతి భవన్ వద్దకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షర్మిల అక్కడే ఉన్నారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్న షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ బయల్దేరారు. వారి నివాసమైన లోటస్ పాండ్ నుంచి షర్మిల వద్దకు వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, విజయమ్మ మధ్య వాగ్వాదం జరిగింది