Politics : రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకమైన కాంగ్రెస్ సీనియర్ నేతలు...
Politics దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ ఒకే తాటిపై ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం చీలికలు ఏర్పడ్డాయి ఇప్పటికే కమిటీ కోర్పుతో తెలంగాణ కాంగ్రెస్ లో పైన దుమారాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇవి రోజుకి ఎక్కువ అవుతుండటంతో కాంగ్రెస్లో సీనియర్ నేతలు అందరూ ఏకమై బట్టి విక్రమార్క నివాసంలో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ వేగంగా మారిపోతూ ఉన్నాయి తాజాగా కమిటీల కోర్టు కాంగ్రెస్ నాయకుల్ని తీవ్ర విచారణకు గురు చేసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా సీనియర్ నేతలకు ఎలాంటి కీలక పదవులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వారంతా అయితే దీనిపై చర్చకు బట్టి విక్రమార్క నివాసం వేదిక అయింది.. ఈ సమావేశానికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సీనియర్ నేతలు మధుయాష్కీ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వీరంతా కమిటీల నియామకం అంశంపై చెలరేగుతున్న వివాదాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, తమతో సంప్రదించకుండా కమిటీలు ఎలా వేశారని సీనియర్ నేతలు ప్రశ్నిస్తోన్నారు. వలసవాదులతో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని, టీ కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడు సరిగ్గా లేరని ఆరోపించారు. పార్టీలు మారిన నాయకుడు చేతిలో పార్టీ బాధ్యతలు పెడితే పార్టీ నాశనం అవుతుందని రేవంత్‌పై సీనియర్లు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు... దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కీలక నేతలందరూ మద్దతు తెలిపారు..