"సదా నన్ను నడిపే" టీజర్ ఆవిష్కరించిన తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ
లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం `సదా నన్ను నడిపే`. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నటించింది. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. మంగళవారం శివారాత్రి నాడు ప్రసాద్‌ల్యాబ్‌లో టీజర్ వేడుక నిర్వహించారు. టీజర్‌ను ముఖ్య అతిథి తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మహ్మద్ అలీ మాట్లాడుతూ... టీజర్ వేడుకలో పాల్గొనడం ఆనందంగా వుంది. హీరో ప్రతీక్ అన్ని శాఖలపై పట్టుతో ముందడుగు వేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హైదరాబాద్‌లో సినిపరిశ్రమ డెవలప్‌మెంట్‌కు వాతావరణం అనుకూలమైంది. ఫిలింసిటీ కూడా వుంది. రాబోయే ఐదేళ్ళలో ముంబై తరహా సినీ పరిశ్రమను హైదరాబాద్‌లో చూడొచ్చు. కరోనా వల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. సి.ఎం. గారు కేబినెట్ మీటింగ్‌లో సినిమా పరిశ్రమపై చర్చకూడా చేశారు. సినీ పరిశ్రమకు ఏదైనా చేయాలనే తపన ఆయనలో వుంది. ఇక ఈ సినిమా చక్కటి ప్రేమకథతో వుంది. ప్రేమకథలు ఎల్లవేలలా విజయాన్ని సాధిస్తాయని పేర్కొన్నారు.నటీనటులుః ప్రతీక్ ప్రేమ్ కుమార్, వైష్ణవి పట్వర్దన్, నాగేంద్రబాబు, రాజీవ్ కనకాల, సూర్య, నవీన్ నేని, రంగస్థలం మహేష్, సుదర్శన్, ఆలమట్టి నాని తదితరులు నటించారు.
సాంకేతికతః కెమెరాః ఎస్.డి. జాన్, సంగీతంః ప్రభు, సుభాకర్, ఫైట్స్- నందు, ఆర్ట్- గోవిందు, డైలాగ్స్- రూప్ కుమార్, ఎడిటింగ్- ఎస్. ఆర్. శేఖర్. నిర్మాత- లంకా కరుణాకర్ దాస్, పి.ఆర్.ఓ.- వంశీ-శేఖర్. కథ, స్క్రీన్ ప్లే, బేక్‌గ్రౌండ్ స్కోర్, దర్శకత్వంః లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్.